ఎంపీ స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌వే..


Mon,April 15, 2019 02:03 AM

-సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో అచెంచల విశ్వాసం
-కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్న టీఆర్‌ఎస్
-ఏపీలో ఓటమి భయంతోనే చంద్రబాబు గగ్గోలు
-స్థానిక సంస్థల్లో అన్ని జడ్పీలను కైవసం చేసుకుంటాం
-విలేకరుల సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
చిట్యాల : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 ఎంపీ స్థానాల్లో తామే గెలువబోతున్నామని.. అలాగే రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అచెంచల విశ్వాసమే అందుకు నిదర్శనమని ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం చిట్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరిలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నల్లగొండలో వేమిరెడ్డి నర్సింహారెడ్డిలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న సమన్వయ లోపం, ఒకరినొకరూ ఓడించాలనే సంప్రదాయం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంటు స్థానాలు టీఆర్‌ఎస్‌కు వస్తే రాష్ర్టానికి మేలు జరుగుతుందని ప్రజలు కూడ నమ్ముతున్నారని వివరించారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితితో టీఆర్‌ఎస్ కేంద్రంలో కీలకపాత్ర పోశించబోతుందని గుత్తా జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, క్యాడర్ పట్టుదలతో పనిచేశారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాలలో గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీ స్థానాలను, ఎంపీపీలు గెలుపొందాలన్నదే సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యమన్నారు.

ఓటమి భయంతోనే బాబు గగ్గోలు
ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి భయంతోనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని, 2014లో ఈవీఎంల ద్వా రానే ముఖ్యమంత్రి అయిన బాబు ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు ఈవీఎంలలో తప్పులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారని గుత్తా అన్నారు. టెక్నాలజీకి తానే ఆధ్యుడనని, హైటెక్ సిటీని తానే నిర్మించాననే చెప్పే బాబు టెక్నాలజీతో ముడిపడిన ఈవీఎంలపై ఆరోపణలు చేయటమేమిటని పశ్నించారు. అధికారం కోల్పోతున్నామనే భయంతో 15 రోజులుగా మోడీ, కేసీఆర్, జగన్‌ల జపం చేసిన బాబు, సెంటిమెంటును వాడుకునే ఉద్దేశంలో ఉద్యమ కా లం గుర్తు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు ఈవీఎంలలో ఏదో జరిగిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ శేపూరి రవిందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంటేశం, సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రుద్రవరం భిక్షం, నాయకులు గుండెబోయిన సైదులు, వనమా వెంకటేశ్వర్లు, కూనూరు సంజయ్‌దాసు, మందడి జనార్దన్‌రెడ్డి. వేలుపల్లి మధుకుమార్, బూరుకు కృష్ణయ్య, కూరెళ్ల యాదయ్య, శీలా సత్యనారాయణ పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...