కమనీయం ... రాములోరి కల్యాణం


Mon,April 15, 2019 02:02 AM

- ఘనంగా శ్రీరామనవమి పర్వదినం
- జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవం
- నల్లగొండ రామాలయంలో పట్టువస్ర్తాలు సమర్పించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ కల్చరల్ : జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం అన్ని చోట్ల రాములోరి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్లగొండలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామగిరిలోని రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి భద్రాద్రి నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ దంపతులు, ఈఓ మోకిరాల రాజేశ్వరశర్మ సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అన్ని చోట్లా వడపప్పు, బెల్లంపానకం, అన్నదానం నిర్వహించారు. నల్లగొండలోని రామగిరి ఆలయంలో శ్రీరంగం దేవస్థానం స్థానాచార్యులు శ్రీమాన్ పరాశర లక్ష్మీనృసింహ భట్టార్ స్థానాచార్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి-రమాదేవి దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, గొల్లగూడలోని ఆలయంలో చాడ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వీరేశం పాల్గొన్నారు. అదే విధంగా దేవరకొండలోని ఇద్దంపల్లి ఆలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, హాలియాలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మునుగోడు మండ లం చీకటిమామిడిలో మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మిగ తా చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని రాములోరి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...