ముందస్తు చర్యలతోనే అగ్ని ప్రమాదాల నివారణ


Mon,April 15, 2019 02:02 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసంరం ఉందని జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞనారాయణ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం స్థానిక జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో తమ ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక అధికారులు, సిబ్బంది సంస్మరణ పరేడ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ద్వారా అగ్నిప్రమాదాల నివారణ, రక్షన చర్యలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్ ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణలో దేశంలో ఏడాదికాలంలో 13 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. సంస్మరణ పరేడ్‌లో భాగంగా వారిసేవలను గుర్తు చేసుకోవాల్సిన అవస రం ఉందన్నారు. నల్లగొండ డివిజన్‌లో ఈ ఏడాది కాలంలో 824 ప్రమాద సంఘటనలకు అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతోపాటు 51 రిస్క్యూకాల్స్ స్పందించి 44 మంది ప్రాణాలను కాపాడమన్నారు. అదేవిధంగా 512 అవగాహన సదస్సులు సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ రాజ్‌కుమార్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, డీఈఓ సరోజినిదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ జీఎస్‌ఎస్.కుమారి తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...