దేశంలో గుణాత్మక మార్పునకు కేసీఆర్ కృషి


Mon,April 15, 2019 02:01 AM

-కలిసి పనిచేద్దాం... పరిషత్ ఎన్నికల్లో విజయం సాధిద్దాం
-రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి
నార్కట్‌పల్లి: దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎంపీపీ రేగ ట్టె మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పలు అభివృద్ధ్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయా సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే 16 ఎంపీ స్థానా లను గెలిపిస్తాయన్నారు. పార్లమంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మొత్తం టీఆర్‌ఎస్‌కే మొగ్గుచూపాలని పేర్కొన్నారు. జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సహకరించిన ప్రతిఒక్క కార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మనమంతా కలిసిమెలసి పనిచేస్తూ మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయంతో పోటీ చేస్తున్న అభ్యర్థ్ధుల విజయం కోసం సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. విభేదాలకు తావివ్వకుండా ఐకమత్యంతో పార్టీకి కట్టుబడి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సట్టు సత్త య్య, వైస్‌ఎంపీపీ పుల్లెంల పద్మముత్తయ్య, ఎండీ రహీంఖాన్, బాజ యాద య్య, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, దుబ్బాక రాంమల్లేష్, శ్రీధర్, ముంత వెం కన్న, బోయపల్లి శ్రీనివాస్, వీసం బాలరాజు, గాయం శ్రీనివాస్‌రెడ్డి, బైరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, పాశం సత్తిరెడ్డి, వడ్డెగోని నర్సింహ, శిలువేరు గిరి, చెర్కుపల్లి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...