టూటౌన్ ఎస్‌ఐ16న టీఎస్ పాలీసెట్


Sun,April 14, 2019 02:04 AM

రామగిరి : డిప్లమో ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 16న నిర్వహించే టీఎస్ పాలిసెట్ పరీక్షకు నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే నల్లగొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నంబూరి శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లాలో జరిగే పరీక్షలకు కోఆర్డినేటర్‌గా సూర్యాపేటలోని ప్రభుత్వ మహిళా పాలీటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నర్సింహారావు వ్యవహరిస్తున్నారు.

19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు...
టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 8,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 5040 మంది విద్యార్థులు హాజరు కానుండగా 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేటలో 3150 మంది హాజరుకానుండగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. అయితే నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.

పాటించాల్సిన సూచనలు...
0 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
హెచ్‌బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు, షార్పునర్, ఎరేజర్ విధిగా తెచ్చుకోవాలి.

వస్తువులకు అనుమతిలేదు.
నల్లగొండలోని పరీక్ష కేంద్రాలు..
ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాల(హైదరాబాద్‌రోడ్డు) ఎన్జీ కాలేజీ (ఏ,బీ సెంటర్స్ నల్లగొండ), ప్రభుత్వ మహిళా కాలేజీ (రామగిరి), ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (ఆర్పీరోడ్డు), లిటిల్‌ఫ్లవర్ జూనియర్ కళాశాల (శాంతినగర్), కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ఒకేషనల్, బాలుర జూనియర్ కళాశాలలు, కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యూజీ బ్లాక్, పీజీ బ్లాక్ కేంద్రాలు, గౌతమి బాలికల, బాలుర జూనియర్ కళాశాలలు.

సూర్యాపేటలో పరీక్ష కేంద్రాలు...
- శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల(ఎస్వీ), ఆర్‌కేఎల్‌కే యూజీ అండ్ పీజీ కళాశాల, ఏవీఎం హైస్కూల్ నిర్మలా దవాఖాన రోడ్డు, గౌతమి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నవోదయ విద్యామందిర్ హైస్కూల్.

జిల్లా కేంద్రాలకు చేరిన ప్రశ్న పత్రాలు, మెటీరియల్స్...
టీఎస్ పాలిసెట్‌కు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్స్ నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాలకు చేరాయి. వాటిని పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్‌లు స్వీకరించారు. పరీక్ష రోజున పోలీస్ బందోబస్తుతో వాటిని కేంద్రాలకు చేరవేస్తారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుండగా నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, చేతి గడియారాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బందితో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
- ఎన్.శ్రీనివాసరావు, రీజినల్ కోఆర్డినేటర్ నల్లగొండ

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...