మహాత్మా.. ఇదేమి దుస్థితి


Mon,March 25, 2019 01:50 AM

ఎంజీ యూనివర్సిటీ: జాతిపితా మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఆ పేరుకే మచ్చతేస్తున్న వైనం దర్పణం పడుతోంది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలల్లోని బీఈడీ ఛాత్రోపాధ్యాయులు(విద్యార్థులకు) తొలి సెమిస్టర్ పరీక్షలను డిసెంబర్ -2018లో నిర్వహించారు. పరీక్షలు ముగిసి 3 నెలలు కావస్తున్నప్పటీకీ నేటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో వందలది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అదే బాటులో మూడోసెమిస్టర్ ఫలితాలు కూడా ఉన్నాయి. ఇది ఎంజీయూ అధికారుల పనితీరుకు దర్పణం పడుతుంది. ఎంజీయూ పరిధి లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37 బీఈడీ కళాశాలు ఉన్నాయి. వీటిలో 2018-20 బ్యాచ్, 2017-19 బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినప్పటీ నేటి ఫలితాలు మాత్రం విడుదచేయకపోవడంతో అటు అధ్యాపకులు, ఇటు ఛాత్రోపాధ్యాయులు(విద్యార్థులు) ఎదుచూపులతో గడుపుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 37 బీఈడీ కళాశాలలు
ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలో కళాశాల లు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 23, సూర్యాపేట జిల్లాలో 09, యాదాద్రి భువనగిరి జిల్లాలో 05 చొప్పున 37 ఉన్నాయి. వీటిలో రెండు సంవత్సరాల్లో కలుపుకుని 5,500లకు పైగా ఛాత్రోపాధ్యాయులు విద్యనభ్యసిస్తున్నా రు. వీరంత భవిష్యత్తు ఉపాధ్యాయులగా త యారుకానున్నారు.

డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షలు...
బీఈడీ తొలి సెమిస్టర్(2018-20బ్యాచ్) ఛాత్రోపాధ్యాయులకు డిసెంబర్ 27, 2018 నుంచి జనవరి07, 2019 వరకు నిర్వహించా రు. పరీక్షల మూల్యాంకనం సహితం ముగిసిం ది. అయినప్పటీకీ మూడు మాసాలు గుడుస్తున్నప్పటీకీ నేటికి ఫలితాలు విడుదల కాలేదు. కాగా ప్రథమ సెమిస్టర్ పూర్తి చేసిన వారికి ద్వితీ య సెమిస్టర్ తరగతులు ప్రస్తుతం సాగుతుండగా ఈ సెమిస్టర్ ఏప్రిల్-2019తో ముగుస్తుం ది. అదేవిధంగా మూడో సెమిస్టర్(2017-19బ్యాచ్)కి థియరీ పరీక్ష ఫిబ్రవరి 16, 20 19న నిర్వహించగా ఇప్పటీకీ మాసం గడిచింది. గతంలో వర్సిటీ వివిధయూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్ ఫలితాలు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంజీయూలో ఆందోళన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఎంజీయూ అధికారులు స్పందించి తక్ష ణం ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...