సాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,March 25, 2019 01:49 AM

నందికొండ : ఎండలు మండుతున్న ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌కు ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు, విదే శీ పర్యాటకులు తరలివచ్చారు. దీంతో సాగర్‌లో పర్యాటకుల సం దడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సా హం చూపారు. కొండపై బుద్ధుడి జీవిత గాథలకు సంబంధించిన శిల్పాలను పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియం, యజ్ఞశాల, ఎత్తైన బుద్ధుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, ఇటుకలతో ఏర్పా టు చేసిన స్వస్తిక్ గుర్తు, అలనాటి నదీలోయ నాగరికతలకు సం బంధించిన చారిత్రాత్మక విశేషాలు తెలుసుకున్నారు. అదే విధం గా శ్రీపర్వతారామం (బుద్ధ్దవనం)లోని గోపురం పైన, మ్యూజియంలో అమర్చిన శిల్పాలను, స్తూపపార్కు, ధ్యానవనం, బుద్ధచరితవనం, మహాస్తూపపార్కు ప్రాంతాల్లో పర్యాటకులతో సం దడి నెలకొంది. లాంచీ స్టేషన్ సమీపంలోని నదీ తీరంలో సరదాగా గడుపుతూ సెల్ఫీలు దిగారు. తెలంగాణ టూ రిజం నాగార్జునకొండకు శని, ఆదివారం లాంచీలు నడపడంతో రూ.40,000 ఆదాయం వచ్చిందని టూరిజం మేనేజర్ సత్యం తెలిపారు. విహారయాత్రలకు వచ్చిన పర్యాటకులతో లాంచీస్టేషన్, బుద్ధవనం, దయ్యాలగండి, డ్యాం పరిసర ప్రాంతాలు కిటకిట లాడాయి.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...