యాదాద్రిలో భక్తుల రద్దీ..


Mon,March 25, 2019 01:49 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఆదివా రం జనసందడితో నిండుకుంది. శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. యాత్రికుల వాహనాలతో ఆలయదారులు, పట్టణ వీధు లు గజిబిజిగా మారాయి. సెలవు కావడంతోపాటు శ్రీలక్ష్మీనరసింహుని జన్మనక్షత్రం కావడంతో భారీ గా భక్తులు తరలివచ్చారు. స్వాతి సందర్భంగా శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించా రు. ప్రభాతసమయంలో యాదాద్రికొండ చుట్టు అనేకమంది భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదా ద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూకట్టారు. శ్రీవారి ఖజానా కు రూ.19, 01, 403 ఆదాయం సమకూరింది. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూ డు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు.

ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీసుదర్శన హో మం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణతంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతును నిర్వహించారు. ఉద యం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టిక్కెట్‌పై బాలాల యం ముఖమండపంలో 10 నిమిషాలపాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు అధరణ పెరుగుతున్నది. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.

వైభవంగా వ్రత పూజలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతా లు పెద్దఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.1,10,000 ఆదాయం సమకూరింది.
శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
శ్రీవారి ఖజానాకు రూ.19, 01, 403 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.19,01,403 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,69,958, 100 రూపాయల టిక్కెట్‌తో రూ.59,500,150 రూపాయల టిక్కె ట్టు దర్శనంలో రూ.4,65,000, గదులు విచారణ శాఖతో రూ.85,230, ప్రసాద విక్రయాలతో రూ.6, 71, 375 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...