ఉత్తమ్ రాజీనామా చేసి పోటీచేయాలి


Sun,March 24, 2019 01:23 AM

- ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
- దద్దమ్మ అని తిట్టినోళ్లకే భువనగిరి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చావ్?
- నల్లగొండలో చెల్లని రూపాయని భువనగిరిలో ఎలా ఆదరిస్తరు?
- కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు : విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
- నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : ఎంపీ గుత్తా

నల్లగొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండలో గెలుపు నాదేననే ఉత్తర కుమార మాటలు పలకడం కాదు... ఎంపీగా గెలుస్తాననే నమ్మకం ఉంటే హుజుర్‌నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థ్దాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అడ్డగోలు మాటలు మాట్లాడడం మనుకొని సవాల్‌ను స్వీకరించాలని, లేకుంటే ఓటమిని అంగీకరించాలని ఉత్తమ్‌కు హితవు పలికారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధ్దిని చూసి విపక్షం నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నారన్నారు. ఉత్తమ్ నాయకుడు కాదని.. దద్దమ్మ అని.. పక్కన కూర్చోని మాట్లాడినా ఏమీ చేయలేక ఎంపీ టికెట్ ఇచ్చావని కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. నల్లగొండలో గెలువలేని కోమటిరెడ్డి భువనగిరికి పోయాడని.. ఇక్కడ చెల్లని రూపాయ అక్కడెలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. నల్లగొండలో 60 ఏళ్లలో జరుగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో జరిగిందని నమ్మిన ప్రజలు గత శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని.. అదే ఉత్సాహంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అటు భువనగిరితో పాటు ఇటు నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థ్దులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

60ఏళ్లలో మీరేం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించిన మంత్రి ఈ నాలుగున్నరేళ్లలో జిల్లా అభివృద్ధ్ది కోసం చేసిన అభివృద్ధిని వివరించారు. దామరచర్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 3మెడికల్ కాలేజీలు, ఎస్సారెస్పీ, డిండి ఎత్తి పోతల, భగీరథ, ఎడమ కాల్వ నీటి విడుదలతో పెరిగిన సాగు లాంటివి మచ్చుకు కొన్ని వివరించారు. ఈ అభివృద్ధిని చూసే జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని.. కాంగ్రెస్ కంచుకోట కాస్త మంచు కోటలా మారి ఇప్పుడు గులాబీ కోటలా మారుతుందన్నారు. గత ఎన్నికలతో సగం తుడుచుపెట్టుకుపోయిన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలతో పూర్తిగా సమాధి కానున్నట్లు తెలిపారు. ఐదేండ్ల క్రితం జాడలేని తెలంగాణ నాలుగున్నరేండ్ల కింద పురుడు పోసుకొని నేడు దేశానికే ఓ రోల్ మోడల్‌గా మారిందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందని వివరించిన మంత్రి దేశప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2001లో సిద్దిపేటలో పార్టీ ప్రకటించి 2014లో స్వరాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చి నేడు రాష్ర్టాన్నే అభివృద్ధిలో ముందుంచి అనేక ఆంధ్రానేతల శాపనార్దాలు లెక్కచేయకుండా తనను తాను పాలించుకోవడమే గాక దేశాన్నే పాలించే స్థ్దితికి ఎదగడానికి కారణం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ బోఫోర్స్.. బీజేపీ రాఫెల్ కుంభకోణాలకు అడ్డాలుగా మారాయని అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా నేడు ప్రజలు ఫెడరల్ ఫ్రంట్ కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కేసీఆర్ నాయత్వాన్ని కోరుతూ16స్థ్ధానాలో గెలిపించాలని.. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ శని పోవాలన్నారు. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక లాగానే అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. నల్లగొండ ఎంపీగా టీఆర్‌ఎస్ అభ్యర్థ్దిగా బరిలో ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ్ధ చైర్మన్ రేఖల భద్రా ద్రి, ఐసీడీఎస్ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాషా, నల్లగొండ,తిప్పర్తి,కనగల్ ఎంపీపీలు దైద రజిత, పాశం రాంరెడ్డి, కొప్పు కృష్ణయ్య, రెడ్‌క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, నేతలు బ కరం వెంకన్న, అభిమన్యుశ్రీనివాస్, అబ్బగోని రమేష్, సుంకరి మల్లేష్‌గౌడ్, బొర్ర సుధాకర్, కటికం సత్తయ్యగౌడ్, పంకజ్ యా దవ్, ఫరీదొద్దీన్, చిలకల గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండలో 60వేల మెజార్టీ తీసుకురావాలి
-కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే,నల్లగొండ
పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ పరిధిలోనే 60వేల మెజార్టీ తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు కృషి చే యాలి. 20 ఏండ్లు గోస తీపించిన శనిని ఎలా తరిమి కొ ట్టారో అదేవిధంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తరిమి కొట్టాలి. కోమటిరెడ్డి నల్లగొండలో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని భువనగిరికి పారిపోయిండు. 20 ఏండ్లు ఓట్లేసిన కాంగ్రేసోళ్ల కడుపు గురించి కోమటిరెడ్డి ఏనా డూ పట్టించుకోలేదు. ఆయన కాదని ఇప్పుడు ఉత్తమ్ వస్తుండు..హౌసింగ్ మంత్రిగా కోట్ల రూపాయలు తిని.. కార్లల్లో కోట్ల రూపాయలు కాల్చిన ఉత్తమ్‌కు ఎలా ఓటు వేసేది. ఈ జిల్లాలో కాంగ్రేసోళ్లకు నూకలు చెల్లినయ్.

ఉత్తమ్ ఓ దొంగ సైనికుడు
-బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యుడు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పదవుల కోసం ఆశపడి ప్రాణ భయంతో సైన్యం నుంచి సైనికులను వదిలేసి వచ్చిన దొంగ సైనికుడు. ఆయన సైనికుడినని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉత్తమ్, కోమటిరెడ్డిలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. వెంకట్‌రెడ్డిని ఇక్కడి ప్రజలు తరిమికొడితే భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయి భువనగిరికి వచ్చాడు. ఇక్కడ అంగి ఊడబీకితే అక్కడ పైజామ్ ఊడబీకుతాం. భువనగిరిలో గెలువకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటుండు.. వీల్లు ఎన్ని సార్లు రాజకీ య సన్యాసం చేస్తారో తెల్వడంలేదు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి పదే పదే రాజీనామా అంటాడు.. వీల్లేమో సన్యాసం అం టూ కాలం గడిపి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలి
-చకిలం అనిల్‌కుమార్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి నల్లగొండ ఎంపీగా బరిలో ఉన్న నర్సింహారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని చూసి అన్నిస్థానాల్లోనూ గెలిపించాలి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గత శాసన సభ ఎన్నికల్లో ఏ విధంగా పని చేశారో అదే విధంగా పనిచేయాలి. నల్లగొండ నుంచి మంచి మెజార్టీ అందచేస్తాం.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
-చాడ కిషన్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట కార్యదర్శి
నల్లగొండ ఎంపీ అభ్యర్థ్దిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న వేమిరెడ్డిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ఇప్పటి వరకు ఉన్న క్రమశిక్షణతోనే కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లోనూ పనిచేయాలి. అన్ని నియోజక వర్గాల్లోనూ గత ఎన్నికలకు మించి మెజార్టీ సాధిస్తేనే కాంగ్రెస్‌ను మట్టి కరిపించగలం. అన్ని సీట్లను గెలిస్తేనే కేంద్రంలో నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతాం.

ఫెడరల్ ఫ్రంట్ దేశాన్నే శాసిస్తుంది
-బండా నరేందర్‌రెడ్డి, టీఎస్ ఎఫ్‌డీసీ చైర్మన్
దేశ ప్రజలు నేడు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని చూసి స్వాగతిస్తుండ్రు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంటే రేపు దేశానికి ప్రత్యామ్నాయం. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థ్దులను గెలిపిస్తే కేసీఆర్ దేశంలో నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతారు. రేపు దేశానికి కాబోయే పీఎం కేసీఆరే. ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టే రేపు ఎన్నికల్లో గెలుపోటములు తెలిసే అవకాశం ఉంది.

గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తా
-వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థ్దిగా తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధ్ది చేస్తా. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోకెల్ల అత్యంత అభివృద్ధ్దిని చేపడుతూ మంచి ప్రగతిని సాధించింది. ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం.

ఎమ్మెల్యే అభ్యర్థులకే ఎంపీ టికెట్లు
-తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్లమెంటు నియోజక వర్గ ఎన్నికల ఇన్‌చార్జి
కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థ్దులు లేక ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థ్దులకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ అభ్యర్థ్దులను డిపాజిట్ దక్కకుండా ఓడించాలి. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అదీనూ ఉత్తమే అయినందున ఆయనను కూడా ఓడించి ఖల్లాస్ చేయాలి. ప్రతి ఓటు కేసీఆర్‌ను దృష్టిలో పెట్టుకొని వేయాలి.

వేమిరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి
-గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంపీ,నల్లగొండ
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నిలబెట్టిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి నల్లగొండ కోటపై గులాబీ జెండా ఎగురవేయాలి. గతంలో నాకు వచ్చిన 1.94 లక్షల మెజార్టీ కంటే మించిన మెజార్టీతో గెలిపించాలి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. పీసీసీ చీఫ్‌గా ఉండి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు తప్ప మిగిలిన వాటిగురించి పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తికి ఓటు ఎలా వేసేది. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న వ్యక్తి.. ఆయన విజన్‌ను నెరవేర్చాలంటే అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మ రో పార్టీ రావాలే.. అది ఫెడరల్ ఫ్రంటే కావాలే.. కేసీఆర్ నిరంతరం ప్రజా సేవకోసం పరితపించే వ్యక్తిత్వం కలవాడు.. ఆ యన చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచే వ్యక్తి.. రాజకీయ నా యకుడు ప్రజల మనస్సును గెలవాలి. నాలుగున్నరేళ్లు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పరిచి సుస్థ్ధిర సమాజం కోసం పాటుపడుతున్నాడు. తానూ అదే ఉద్దేశంతో వార్డు సభ్యుడి నుంచి ఎంపీగా ఎదిగానని.. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు.. ఏ పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేయాలె.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...