దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి


Sun,March 24, 2019 01:21 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : భువనగిరి పార్లమెంటు పరిధిలో తాను ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిపై, ఐదేళ్లు ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని భువనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ సవాల్ విసిరారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ డమ్మీ అంటూ అవాకులు, చెవాకులు మాట్లాడారని చెప్పిన ఆయన ఇదే బూర నర్సయ్యగౌడ్ చేతిలో 2014లో ఓడిపోయింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీరు డమ్మీ అని పిలుస్తున్న బూర నర్సయ్య అనే నేను రూ.1,028 కోట్ల ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాసుపోర్టు కేంద్రం, పెద్ద ఎత్తున జాతీయ రహదారులు, కులవృత్తుల సంక్షేమానికి రూ.10కోట్లు తీసుకొచ్చానన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాను డమ్మీని కాదని మీ రాజకీయాలకు గోరి కడతానన్నారు. 20ఏళ్లు నల్లగొండ శాసనసభ్యునిగా పనిచేసిన కోమటిరెడ్డి నల్లగొండను కార్పొరేషన్‌గా ఎందుకు తీర్చిదిద్దలేదని, ఇప్పటి వరకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాలను సైతం తీసుకురాలేదన్నారు. మిర్యాలగూడ శాసనసభ్యుడిగా భాస్కర్‌రావు గెలిస్తే టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో అటెండర్ పనిచేస్తానన్నారని, అంతేకాకుండా నల్లగొండలో టీఆర్‌ఎస్ ఒక్క స్థానం గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదో ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఈ నెల 25న భారీ ర్యాలీ తో నామినేషన్ వేస్తానని ఆ తెలిపారు. ఈ సందర్భంగా 30వేల నుంచి 40వేల మం దితో ర్యాలీ నిర్వహిస్తానని చెప్పారు. భువనగిరి పట్టణంలోని సాయిబాబా దేవాల యం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఉద యం 11 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు ఏడు నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జీలు హాజరవుతారని చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించే కోమటిరెడ్డి సోదరులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. ఐదేళ్లు ఎంపీగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఏం చేశాడో కంటికి కనిపిస్తోందన్నారు. ఎంపీగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేగా తాను పట్టుబట్టి ఎయిమ్స్, పాసుపోర్టు కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఇలా ఎన్నో అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...