కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెప్తారు..


Sat,March 23, 2019 12:25 AM

- ఎంపీ ఎన్నికల్లో గతం కంటే భిన్నంగా తెలంగాణ ప్రజల తీర్పు ఉండాలి
- విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి
- కోమటిరెడ్డి బ్రదర్స్ కోతలరాయుళ్లు: బూర


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పాలించి 70 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తు పాలన కొనసాగిస్తు న్న ఫలితంగా దేశంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువవనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డిలతో కలిసి భువనగిరిలోని దీప్తి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగిన ఎన్నికలకు భి న్నంగా ఈసారి తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఈ సారి ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎజెండా దేశ ప్రజల ముందుంచారన్నారు. దేశంలో ఉన్న వనరులను సరైన పద్ధ్దతిలో వినియోగిస్తే దేశం ఇంకా వెనుకబడిన జాబితాలో ఉండేది కాదన్నారు. దేశంలో నిజమైన ఫెడరల్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఫెడరల్ ఎజెండాను టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకుతీసుకువచ్చారని తెలిపారు. ఐదేళ్ల క్రితం ఉనికిలో లేని తెలంగాణ, కేవలం నాలుగేండ్ల లోనే దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, వారు అవలంబించిన విధానం, ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలికమైన అభివృద్ధి పథకాల విషయంలో, ఈ దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా చేశారని చెప్పారు. రాష్ట్రంలో మనకున్న 17 పార్లమెంట్ సీట్లను గెలిపించుకుంటే 16 స్థానాలు టీఆర్‌ఎస్, మిత్రపక్షమైన మజ్లీస్ గెలిపించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. చాలామంది మాట్లాడుతున్నారు 16 సీట్లతో ఏమైతదని వారిస్తున్నారని తెలిపారు. 9 సీట్లు ఉన్న పార్టీలు కూడా ప్రధానమంత్రిగా నిలిచారని, దేశరాజకీయాలను శాసించారని తెలిపారు. తప్పకుండా కేంద్రంలో సంకీర్ణంతో కూటమితో కూడి న పార్టీ అధికారంలో వస్తుందన్నారు. మనం అందులో కీలకం కానున్నామన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసే అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారన్నారు.

అంకితభావం కలిగిన నాయకుడు బూర
గత పార్లమెంట్ సభ్యుల మాదిరిగా కాకుండా కేంద్రం ప్రభుత్వం సహకరించిన.. సహకరించకపోయినా ఎంపీ నర్సయ్యగౌడ్ ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేశారని తెలిపారు. భువనగిరిలో ఎయి మ్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు నాలుగు లైన్ జాతీయ రహదారుల ఏర్పాటులో బూర నర్సయ్యగౌడ్ ఎంతో కృషి చేశారని తెలిపా రు. పార్లమెంట్ ఎన్నికల్లో 16కు 16 పార్లమెంట్ సీట్లతో పాటు భువనగిరి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నియమించిన బూర నర్సయ్యగౌడ్‌కు అత్యదిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ కోతలరాయుళ్లు: బూర
భువనగిరిలో తాను చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు ఎక్కడైనా ఏ వేదికపైన అయినా ఏ ఛానల్‌లోనైనా చర్చించేందుకు సిద్ధ్దమని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ సవాల్ విసిరారు. డబ్బుతో గబ్బు పను లు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కోతల రాయుళ్లు భువనగిరి ప్రజలు తగిన బుద్ధ్ది చెప్తారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆసరాతో భువనగిరిలో అనేక అభివృద్ధి పనులు చేయగలిగానని చెప్పారు. పారిశ్రామిక క్లస్టర్లను సాధించామని చెప్పారు. రూ.1028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను స్థాపించేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడిపోయిందని చెప్పా రు. ఒకప్పుడు నల్లగొండ కంటే వెనుకబడి ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర పట్టణాలు కార్పొరేషన్లుగా ప్రమోషన్ పొందాయని గుర్తు చేశారు. మనుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్‌మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేలు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొల్పుల అమరేందర్, రాష్ట్ర నాయకులు వంగాల వెంకన్నగౌడ్, జిల్లా నాయకులు నల్లమాస రమేష్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నువ్వు ల ప్రసన్న, పట్టణాధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, ఎం పీపీ తోటకూరి వెంకటేశ్‌యాదవ్, జడ్పీటీసీ సందుల సుధాకర్, మాజీఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ, సుబ్బురు బీరుల మల్లయ్య, కేశవపట్నం రమేష్, టీజీఏ జిల్లా అధ్యక్షుడు చిక్కా ప్రభాకర్‌గౌడ్, ఆలేరు జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులునాయక్, వైస్‌చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...