పార్లమెంట్‌కు భారీగా నామినేషన్లు


Sat,March 23, 2019 12:23 AM

నీలగిరి: నల్లగొండ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం భారీగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థ్ధి గార్లపాటి జితేందర్ నామినేషన్లు దాఖలు చేయగా సీపీఎం అభ్యర్థ్ధి మల్లు లక్ష్మి తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు. వీరితోపాటు కాంగ్రెస్ తరపున నల్లమాద పద్మావతి, రిపబ్లిక్ పార్టీ తరపున చింతమల్ల సైదమ్మ, యూసీసీఆర్‌ఐ తరపున సుంకర రమేష్, ఎంసీపీఐయూ తరపున వసుకుల మట్టయ్యతోపాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా మారం వెంకటరెడ్డి, మర్రి నెహమ్యా, నందిపాటిజానయ్య, మేకల వెంకన్న, దొంగరి వేణు, వడ్త్య శ్రీనులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లకు గడువు మూడు రోజు లు ఉన్నప్పటికి నేడు,రేపు సెలవుదినాలు కావడంతో సోమవారం ఒక్క రోజే నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లను వేశారు.

భువనగిరిలో జోరందుకున్న నామినేషన్ల పర్వం
యాదాద్రి భువనగిరిజిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: భువనగిరి పార్లమెంట్ స్థానానికి భారీగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. 13 మంది అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్‌కు సమర్పించారు. టీఆర్‌ఎస్ పక్షాన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ రెండుసెట్ల నామినేషన్లను, కాంగ్రెస్ పక్షాన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండుసెట్లను, స్వతంత్ర అభ్యర్థ్ధి భీమనబోయిన రమేశ్ రెండుసెట్లను, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ పక్షాన ఊదరి మల్లేశం రెండుసెట్లను, బీజేపీ పక్షాన పీవీ.శ్యాంసుందర్ ఒకసెట్‌ను, స్వతంత్ర అభ్యర్థిగా మొరిగాడి కృష్ణ ఒకసెట్‌ను, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పక్షాన సామ్రాట్ నరేందర్‌బోయ్‌లా ఒకసెట్, స్వతంత్ర అభ్యర్థ్ధి బూషపాక వెంకటయ్య ఒకసెట్‌ను, స్వతంత్ర అభ్యర్థ్ధి కొమ్ము శోభారాణి, ఒకసెట్ చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...