త్రిపురారంలో కాంగ్రెస్ ఖాళీ!


Sat,March 23, 2019 12:23 AM

త్రిపురారం : మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డితో పాటు మండలంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన 7గురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, సింగిల్‌విండో చైర్మన్, టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్‌పార్టీని వీడి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, మాజీఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, త్రిపురారం సింగిల్‌విండో చైర్మన్ అనుముల నర్సిరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బైరం కృష్ణ, టీడీపీ త్రిపురారం గ్రామశాఖ అధ్యక్షుడు తాటి సుధాకర్‌రెడ్డి, బెజ్జికల్ ఎంపీటీసీ ఇండ్ల సునీతనాగరాజు, జి.అన్నారం సర్పంచ్ చిలక సుభాష్‌రెడ్డి, బొర్రాయిపాలెం సర్పంచ్ కలకొండ వెంకటమ్మసైదయ్య, రాజేంద్రనగర్ సర్పంచ్ గుండ్లపల్లి సునీతవెంకట్‌రెడ్డి, సత్యనారాయణపురం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్, బెజ్జికల్ సర్పంచ్ ఇండ్ల కౌసల్యవెంకటయ్య, దుగ్గేపల్లి సర్పంచ్ చిలక స్వప్న, పూసలపాడు సర్పంచ్ చేపూరి నిర్మల, అభంగాపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాయించు గోవిందు, బెజ్జికల్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మన్నూరి సైదులు, రాయినబోయిన వెంకన్న, బిట్టు నర్సయ్య, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పామోజు వెంకటాచారి పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...