టీఆర్‌ఎస్ ప్రచార హోరు


Sat,March 23, 2019 12:23 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను భారీ మెజారిటీలతో గెలుచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ప్రకటనకు ముందే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో రెండు స్థానాల్లోనూ భారీ సభలను తలదన్నే రీతిలో సన్నాహక సమావేశాలను టీఆర్‌ఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా భువనగిరి నుంచి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నల్లగొండ నుంచి వేమిరెడ్డి నర్సింహ్మా రెడ్డిని అభ్యర్థులుగా ఖరారు చేసిన నేపథ్యంలో.. నేటి నుంచి ప్రచారంను మరింత విస్తృతం చేసే దిశగా అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 10 గంటలకు నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించున్నారు. విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహ్మా రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం సూర్యాపేటలో 4 గంటలకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం దేవరకొండలో.. సాయంత్రం హుజూర్‌నగర్‌లో విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఈనెల 25న నామినేషన్ కార్యక్రమం నిర్వహణ అనంతరం.. 26న ఉదయం మిర్యాలగూడ, సాయంత్రం కోదాడలో, ఈనెల 27న ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశా లు జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రచారాన్ని విస్తృతం చేసే క్రమంలో జరుగుతున్న ఈ సమావేశాలతోపాటు త్వరలోనే టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జిల్లాలో ప్రచారానికి రానున్నారు. వారం రోజుల్లోనే అధినేత పర్యటన ఉంటుందని సమాచారం.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...