సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల


Sat,March 23, 2019 12:22 AM

నందికొండ: నాగార్జునసాగర్ ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఎడమకాల్వ పరిధిలో యాసంగి సాగుకు 23 టీఎంసీలు నీటిని కేటాయించి, డిసెంబర్ 26వ తేదీన నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తున్నామన్నారు. కృష్ణ బోర్డు ఆదేశాలనుసారం ఐదు విడుతల్లో 32 టీఎంసీలు నీటిని విడుదల చేశామని, 6వ విడుతను 1000 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ 9 రోజులపాటు 10,000 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఎడమ కాల్వలకు ఇం కా 6 టీఎంసీలు నీటి విడుదల చేయాల్సి ఉందని ఎనెస్పీ అధికారులు తెలిపారు. కుడికాల్వకు తాగునీటి అవసరాల కోసం రోజు కు 3000 వేల క్యూసెక్కులతో ఆరు రోజలపాటు నీటి విడుదలను కొనసాగిస్తామని ఎనెస్పీ అధికారుల తెలిపారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గానూ ప్రసు త్తం 520.60 అడుగుల వద్ద 150.3730 టీఎంసీల నీరు నిల్వ వుంది. శుక్రవారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి ఇన్‌ఫ్లో లేదు. నాగార్జునసాగర్ డ్యాం నుండి ప్రధాన జల విద్యుత్‌కేం ద్రం ద్వారా 7595 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6097 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 2915 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గేట్సు ద్వారా 10 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ డ్యాం నుంచి మొత్తం 18,417 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 826.10 అడుగులకు చేరుకొని 45.7586 టీఎంసీల నీరు నిల్వ వుంది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...