జగతికి జీవనాధారం


Fri,March 22, 2019 02:40 AM

తిరుమలగిరి నమస్తేతెలంగాణ/భానుపురి: భూమ్మీద కేవ లం 0.007 శాతం మాత్రమే పరిశుభ్రమైన నీరు ఉంది. నీరు లేకుండా మనిషి ఒక్కరోజు కంటే ఎక్కువకాలం మనుగడ సాగించలేడు. అంత విలువైన నీరు ఏదో ఒకరోజు పూర్తిగా దొరకని పరిస్థ్దితి ఎదురైతే ..? ఈ ప్రశ్న ఊహించడానికే భయంగా ఉందికదా ..? అందుకే ప్రతీ నీటి చుక్కను కాపాడుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 1992లో రియో డీజెనిరోలో జరిగిన పర్యావరణ అభివృద్ధ్ది సదస్సులో తీర్మానించింది. ఈమేరకు 1993 మార్చి 22న మొదటిసారిగా ప్రపంచ జలదినోత్సవాన్ని జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా 2003 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి మంచినీటి సంవత్సరంగా ప్రకటించింది. 2005 నుంచి 2015 వరకు జీవం కోసం జలం నినాదంతో అంతర్జాతీ ఉద్యమ దశాబ్దంగా ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాలు, కాలుష్యం, నీటి నిలువలు, వృథాజలాల నిర్వహణ లోపాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు జలదినోత్సవం జరుపుకుంటున్నారు.

భూమి మీద మూడు వంతుల నీరు
భూమ్మీద మూడొంతుల నీరు ఒక వంతు నేల ఉంది. ఈ మూడొంతుల నీళ్లల్లో 97శాతం నీరు సముద్రాల్లో, మహా సముద్రాల్లో ఉంది. అయితే ఇదంతా ఉప్పునీరే. మిగిలిన మూడుశాతం మంచినీళ్లు. ఇందులో 2శాతం ధ్రువ ప్రాంతంలో ఉంది. ఇక ఈ ఒక్కశాతం నీటినే భూమిపై ఉన్న అన్ని జీవరాసులు వాడుకోవాలి. ఈ నేపథ్యంలో మనవ విచ్చలవిడి వాడకంతో ఎన్నో దేశాలను తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. 2025 నాటికి 65 దేశాల్లో నీటిక కొరత తీవ్రరూపం దాల్చనుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో మన దేశం కూడా ఒకటని చెబుతున్నారు. కాగా భారతదేశంలో వర్షపు నీరే ముఖ్యమైన నీటి వనరు. దేశంలో సరాసరి సంవత్సరానికి 4 వేల బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్స్ ) నీరు వర్షం ద్వారా లభిస్తుంది. ఇందులో నుంచి కొంత ఆవిరి కాగా ,1869 బీసీఎం నీరు నదుల్లో చేరి ప్రవహిస్తోంది దీనిలో నుంచి 1123 బీసీఎంల నీరు మాత్రమే ప్రస్తుత విధానాల ద్వారా వాడుటకు యోగ్యమైనది. గతంలో 40 అడుగుల్లో లభ్యమయ్యే గ్రామాల్లో నేడు 300 అడుగుల లొతుకు పడిపోయింది. ప్రపంచంలో 80దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

సింగపూర్ ఆదర్శం
సింగపూర్ చిన్న దేశమైన చక్కటి ప్రణాళికతో ప్రజాభాగస్వామ్యంతో నీటి కరువును అధిగమించి ఆదర్శంగా నిలిచింది. అక్కడి ప్రభుత్వం చుక్కనీటిని కూడా వృథాగా పొనివ్వటం లేదు. మురుగునీటిని సైతం స్వచ్ఛమైన నీరుగా మార్చే టెక్నాలజీని రూపొందించుకుంది. నిజానికి ఆ దేశానికి ఉన్న జలవనరులు చాలా పరిమితం . అయినప్పటికి రాబోయే 50 ఏళ్లలో కూడ నీటి సమస్య రాకుండా జాగ్రత్త పడుతుంది. ఆ దేశ విస్త్రీర్ణం 710 చదరపు కిలోమీటర్లే అయినా చుక్కనీరు కూడా వృథా కాకుండా మొత్తం భూగర్భంలో ఇంకిపోయేటట్లు చర్య లు చేపట్టింది. రేపటి తరానికి నీటి పొదుపు విలువ తెలిసేలా పాఠ్యప్రణాళికలో రూపొందించింది. మనదేశంలోనూ ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహరాష్ట్రలోని హివ్రేబజార్ గ్రామప్రజలు వర్షపు నీటిని అమృతం లా ఒడిసి పట్టుకుంటున్నారు. చెక్ డ్యాముల ద్వారా ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేస్తున్నా రు. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. అన్నాహజారే స్వగ్రామమైన రాలెగావ్‌సిద్ది కూడా సమిష్టి కృషితో జల స్వాలంబన సాధించింది.

నీటి ఖర్చు ఒక్కొక్కరికి రూ, లక్షకు పైగానే..
ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం తాగే నీటికోసం రూ.లక్ష కు పైగా ఖర్చు పెడుతున్నన్నాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ లెక్క న నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కో వ్యక్తి రోజుకు రెండున్నర లీటర్ల నీటిని తాగినట్లయితే ఆ కుటుంబం అరవై ఏళ్లల్లో ఖర్చుపెట్టేది అక్షరాలా నాలుగు లక్షల పైచిలుకే .

ఒక వ్యక్తికి కనీస నీటి అవసరమెంత..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ్ద నివేదిక ప్రకారం ఒక వ్యక్తికి కనీస అవసరమైన నీరు రోజుకు 20 లీటర్లు, కానీ అమెరికాలో ఒక వ్యక్తి రోజుకు 500 లీటర్లు వాడుతున్నాడు. అసియా దేశాల్లో 85, ఆఫ్రికాలో 45 లీటర్ల వాడుతున్నాడు. నీటిని పొదుపుగా వాడాలి

ప్రాణాధారమైన నీటిని మితంగా వాడుకోవాలి. ఇది ప్రతిఒక్కరి కర్తవ్యం. మన ఇంట్లో నీటిగొట్టాల్లో లీకేజీలుంటే అరికట్టాలి. ఎందుకుంటే ఒక సెకనుకు ఒక చుక్కనీరు కారిపోయినా.. దాని ని లెక్కిస్తే సంవత్సరానికి 10.220 లీటర్ల నీరు వృథాగా పోయినట్లే మనం వాడుతున్న టాయిలెట్ కమోడ్‌ను శుభ్రపరచడానికి సుమారు 25 లీటర్ల నీరు వాడుతున్నాం. దీని స్థానం లో ఆల్ట్రాలో ప్లస్ కమోడ్‌ను అమర్చితే అది 6 లీటర్ల నీటిని మాత్ర మే తీసుకుంటుంది. అంటే 19 లీటర్లు పొదుపు చేసినట్లే.

ప్రపంచవ్యాప్తంగా వారంలో 30 వేల ప్రాణాలు బలి
ప్రపంచంలో రక్షిత మంచినీరు అభించక సుమారు 783 విలియన్ల మంది ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. ఈ వ్యాధులతో వారానికి 30 వేల మంది పిల్లలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం సుమారు 5 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఫ్లోరిన్ రహితమే ప్రభుత్వ లక్ష్యం
ప్రపంచంలో అత్యధిక ఫ్లోరిన్ ప్రాం తాల్లో నల్లగొండ జిల్లా ఒకటి. ఫ్లోరి న్ నీటితో పిల్లలు వృద్ధ్దులుగా మా రి.. వారి బాల్యం వెక్కిరిస్తున్నా 70 ఏళ్లుగా పాలకులు రక్షితనీరు అందివ్వకపోవటం దారుణం. ఈ క్రమం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అం దించాలనే గొప్ప ఆలోచనతో మిష న్ భగీరథతో ఇంటింటికి సురక్షిత నీరు అందిస్తుంది.

నీటి సంరక్షణకు తీసుకోవల్సిన చర్యలు
- మురికి నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వాడేవిధంగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలి.
- ప్రతి ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. సాగునీటి కోసం రైతులు తమ పొలాల్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలి.
- గుంటలు, కుంటలు, కొలనులు, చెరువల్లో పూడికలను తీసి నీటి నిల్వలను పెంచాలి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి.
- ప్రతి ఇంటికి నీటి మీటర్లు అమర్చి నీటి పొదుపు పాటించిన వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి.
- రాబోవు తరానికి కనీసం తాగునీరైనా ఇవ్వడానికి మనం కృషిచేయాలి.తరుగుతున్న జలవనరులను మనం కాపాడాలి.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...