ఉండ్రుగొండలో ఘనంగా నారసింహ హోమం


Fri,March 22, 2019 02:39 AM

చివ్వెంల : సూర్యా పేట జిల్లా చివ్వెంల మం డల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో హోలీ పౌర్ణమి సందర్భం గా గురువారం సుదర్శన నారసింహ హోమం యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించా రు. హోమంలో భాగం గా ప్రముఖ యజ్ఞకుడు ముడుంబై శ్రీనాదాచార్యులు ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యులు వేద మంత్రాలతో హోమం నిర్వహించారు. ఈసందర్భంగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబందనం, మూర్తి కుంబారాధన, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, గాయత్రీమంత్ర, సుదర్శన శతక మంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు చేశారు. ప్రతీ నెల పౌర్ణమి రోజున సుదర్శన నారసింహహోమం నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్ తెలిపారు. భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చకిలం ఫణికుమార్, కట్టెకోల గోపాలకృష్ణరావు, మురళీకృష్ణ, ప్రేమ్‌సాగర్, మల్ల య్య, పద్మ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...