ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు


Fri,March 22, 2019 02:39 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను గురువారం కలెక్టర్ ఉప్పల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పర్యవేక్షక అధికారులు, పోలింగ్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఉప్పల్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్ ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...