ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి


Fri,March 22, 2019 02:39 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అధికారులకు సూచించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగు విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని సూచించారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 8పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటి పరిధిలో 1079 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. అదే విధంగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్‌సింగ్, జేడీఏ గోగుల శ్రీధర్‌రెడ్డిపరిశీలించారు. అనంతరం డివిజన్ పరిధిలోని 8 పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో వెళ్తున్న వాహనాలకు ఆర్డీఓ జగన్నాథరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్,నాగమణి రఘునాథ్, కార్తీక్ ఉన్నారు

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...