వంద ఎకరాల భూస్వాములకే ఓటు


Fri,March 22, 2019 02:38 AM

మునగాల : నేడు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంది. కానీ మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు బ్రిటీష్ పాలనలో వంద ఎకరాల కంటే అధికంగా ఉన్న భూస్వాములకే ఓటుహక్కు ఉండేది. ఈ నిబంధన మేరకు మునగాలకు చెందిన నలుగురికి ఓటుహక్కు లభించింది. 1947కు ముందు తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలో.. సూర్యాపేట జిల్లా పరిధిలోని మునగాల పరగణా మాత్రం బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పట్లో బ్రిటన్‌లో లేబర్ పార్టీ, కన్‌సర్‌వేటివ్ పార్టీల మధ్య పోటీ ఉండగా.. కన్‌సర్‌వేటివ్ పార్టీ భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వటానికి వ్యతిరేకం కాగా.. లేబర్‌పార్టీ మాత్రం సుముఖుంగా ఉండేది. బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో మండల కేంద్రానికి చెందిన దేవరం సీతయ్య, చిల్లంచర్ల అప్పయ్య, కాసర్ల రామాంజం, దేవినేని రామయ్యలు మద్రాస్‌కు వెళ్లి తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు దేవరం పెద్దఅప్పిరెడ్డి నమస్తే తెలంగాణకు వివరించారు. ఈ ఎన్నికల్లో మన దేశంలో ఓటు హక్కు కలిగిఉన్న వారంతా లేబర్ పార్టీకి ఓటు వేయగా బ్రిటన్‌లో ఆ పార్టీ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...