ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం


Thu,March 21, 2019 12:48 AM

నీలగిరి : ఈ నెల 22న జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జిల్లాలో 30 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి 2,488 మంది పురుషులు, 1,370 మంది మహిళలు, ఇతరులు ఒకరు, మొత్తం 3,859 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ పంపిణీ చేయడానికి మిర్యాలగూడ, దేవరకొండ ప్రభుత్వ జూ. కళాశాల, నల్లగొండ ఎన్జీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు చేరుకుని మెటీరియల్ తీసుకుని అదే రోజున వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ నెల 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు 9 మంది బరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 39 మంది ప్రిసెడింగ్ అధికారులు, 39 మంది సహాయ ప్రిసెడింగ్ అధికారులు, 48 మంది ఇతర పోలింగ్ అధికారులు, 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...