జూన్‌లోగా మొక్కలు సిద్ధం చేయాలి: శేఖర్‌రెడ్డి


Thu,March 21, 2019 12:48 AM

కట్టంగూర్, నమస్తే తెలంగాణ: జిల్లాలోని అన్ని వననర్సరీలో సిబ్బంది జూన్ మొదటి వారంలోగా మొక్కలను సిద్ధ్దం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి వై.శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అయిటి పాముల వననర్సరీని ఆయన పరిశీలించి ఉపాధిహామీ సిబ్బంది సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 40వేల మొక్కల చొప్పున నాటేందుకు గ్రామసర్పంచ్‌తో కలిసి ప్రణాళికలు తయారు చేయాలని ఫీల్డ్‌అసిస్టెంట్లు సూచించారు. ఉపాధిహామీ సిబ్బంది ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులను, మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలన్నారు. నర్సరీలలో పండ్ల, పూల మొక్కలతోపాటు ఆర్వేదిక మొక్కలను ఎక్కువగా పెంచాలన్నారు. నర్సరీలో వందశాతం మొక్కలు బతికేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో భూర్భజలాలు అడుగంటి పోతుండడంతో నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలు, పారంపాండ్స్, వరదకట్టలు, గుట్టల చుట్టు కందకాల పనులు మాత్రమే చేయాలని సూచించారు. మొక్కల పెంపకంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజవాడ సరోజనసైదులు, క్లస్టర్ ఏపీడీ ముత్త య్య, ఎంపీటీసీ పబ్బు వెంకన్న, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం చౌగోని వినోద, ఉప సర్పంచ్ ముత్యాల లింగయ్య, రైతు సమన్వసమితి మండల కమిటీ సభ్యుడు బెజవాడ సైదులు, ఈసీ నాగరాజు, టీఏలు శ్రీధ ర్, నాగభూషన్, నవనీత, విజయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్‌లు స్వప్న, లక్ష్మణ్, వన సేవకులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...