పూలే, అంబేద్కర్ మార్గంలో నడవాలి


Wed,March 20, 2019 02:05 AM

-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
రామగిరి : దేశంలోని అసమానతలపై మహత్మా జ్యోతిరావుపూలే, డా. బీఆర్ అంబేద్కర్‌లు జీవితకాలం పోరాటాలు చేశారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ॥ ఆర్.లింబాద్రి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భారత దేశంలో సామాజిక న్యాయం-మహాత్మా జ్యోతిరావుపూలే, బీ.ఆర్ అంబేద్కర్ కృషి అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాపులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కొన్ని అగ్రవర్ణాల వారు సమాజంపై ఆధిపత్యాన్ని చెలాయించారని, వాటిని రూపు మాపేందుకు పూలే, అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. వారి బాటలో యువత ముందుకు సాగి నవసమాజాన్ని నిర్మించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ॥ దండిబోయిన రవీందర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొ॥ కె. పల్లవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల-గజ్వేల్ అసిస్టెంట్ ప్రొ॥ కె. హుస్సేన్, సెమినార్ కన్వీనర్ నాగుల వేణు మాట్లాడారు. ఎన్జీ కాలేజి ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్‌లో వైస్ ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, కోయి కోటేశ్వర్‌రావు, డా. దీపిక, వెంకటరెడ్డి, బీఆర్‌ఏవోయూ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డా. బి. ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...