మన సంస్కృతికి దర్పణం పంచాంగం


Wed,March 20, 2019 02:04 AM

-అర్చకత్వానికి పూర్వ వైభవం తెచ్చింది సీఎం కేసీఆరే
-విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
-శ్రీ వికారినామ సంవత్సర పంచాగం ఆవిష్కరణ
నల్లగొండకల్చరల్ : భారతీయ సంస్కృకి దర్పణంగా పంచాంగం నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం, అర్చక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించగా మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్చకత్వం కొంత కాలం పాటు సంక్షోభంలో చిక్కుకుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆదరణ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన రోజునే గోదావరి పుష్కరాలు మొదలయ్యేవి రాజమండ్రిలో కాదు ధర్మపురిలో అన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది మనమే అన్నారు. వ్యవసాయం, జ్యోతిష్య శాస్త్రం, ప్రకృతికి అనుకూలంగా నడిచే అంశాలని.. ఒక దశలో వీటిని చేస్తున్నామని చెప్పడం నామూషిగా భావించే సందర్భాలు వచ్చాయన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ రెండింటిని పూర్వవైభవం వచ్చిందన్నారు. నల్లగొండలో ఉదయ సముద్రం సమీపంలో వేద పాఠశాలతో పాటు బ్రాహ్మణ భవన్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ శుభ, అశుభాలను నిర్ణయించి దిశా నిర్దేశం చేసేవి పంచాంగాలన్నారు.

పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి ఎ. ప్రసాద్‌శర్మ మాట్లాడుతూ దేశంలోనే ఏ ప్రభుత్వం కల్పించని విధంగా బ్రాహ్మణులకు, అర్చకులకు, అర్చకత్వానికి ప్రాధాన్యత తెచ్చిన చండీమానస పుత్రుడు సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. అర్చకులంటే తక్కువేమి కాదు సమాజ శ్రేయస్సును కోరేవారని ప్రజల్లో గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, దేవాదాయ అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూ ర్తి మాట్లాడుతూ తెలంగాణలో బ్రాహ్మణ అర్చకులకు ఉన్న సమస్యలను సీఎంకేసీఆర్ తీర్చారని, ఇంకా ఉన్నవి కూడా పరిష్కరించాలని కోరారు. అనంతరం గంగుభానుమూర్తి-సావిత్రి దంపతులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దౌలతాబాద్‌వాసుదేవశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అర్చక బ్రాహ్మణ సంఘాల జిల్లా అధ్యక్షులు పోతుల పాటి రామలింగేశ్వరశర్మ, గుదే లక్ష్మీనర్సయ్యశర్మ, కోడుగంటి వెంకట రమణశాస్త్రి, కోశాధికారి పులిరామకృష్ణశర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీరామడుగు శ్రీనివాసశర్మ, టీఆర్‌ఎస్ నాయకులు సుంకరి మల్లేష్‌గౌడ్, చిలుకలగోవర్దన్, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, దేవదాయ శాఖ సూపరింటెంటెంట్ రఘు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బ్రాహ్మణులు, అర్చకులు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...