డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి


Wed,March 20, 2019 02:04 AM

రామగిరి : డా.బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ (ఇయర్‌వైజ్) కోర్సులు చదువుతున్న ప్రథమ, ద్వితీయ,తృతీయ సంవత్సరం విద్యార్థులు స్పెల్-1 పరీక్షలకు ఫీజులను చెల్లించాలని ఆ యూనివర్సిటీ నల్లగొండ రీజనల్ కో ఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డా. బీ. ధర్మానాయక్ పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని ఆర్‌సీసీలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29లోగా డిగ్రీ అభ్యర్థులంతా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన వారికి ఏప్రిల్ 29 నుంచి మే 16 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో ఉన్న విద్యార్థులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండి ఎలాంటి విద్యార్హత లేని వారంతా యూనివర్సిటీ నిర్వహించే డిగ్రీ అర్హత పరీక్ష -2019కి ఆన్‌లైన్‌లో ఈ నెల 28లోగా దరఖాస్తులను చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 28న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష జరుగుతుండగా నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 10 అధ్యయన కేంద్రాలలో పరీక్ష ఉంటుందన్నారు. సీబీసీఎస్ విధానంలో డిగ్రీ 3వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వచ్చాయని, మే1 లోగా ఫీజు చెల్లించాలన్నారు. ఈ విషయాన్ని అన్ని అధ్యయన కేంద్రాల కోర్డినేటర్లు ఆయా కేంద్రాల పరిధిలోని విద్యార్థులకు తెలిపి ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని కోరారు. వివరాలకు నల్లగొండలోని ఆర్‌సీసీ సెంటర్ 08682 223768లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఏవోయు నల్లగొండ ఆర్‌సీసీ జూనియర్ అసిస్టెంట్ రేక్యానాయక్, బండా మహేష్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...