అన్ని యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ అమలు


Wed,March 20, 2019 02:04 AM

-పారదర్శకంగా దోస్త్‌తో డిగ్రీ అడ్మిషన్లు
-తెలంగాణలోని ఆరు యూనివర్సిటీలకూ ఒకే పీజీ సెట్
-దేశంలోనే దోస్త్ అడ్మిషన్లలో తెలంగాణ ప్రథమం
నమస్తేతెలంగాణతో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొ.లింబాద్రి
రామగిరి: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం (2019-20) తెలంగాణ అన్ని యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని సూచిం చామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, దోస్త్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొ. లింబాద్రి తెలిపారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించిన జాతీయ వర్కుషాప్‌కు హాజరైన ఆ యన దోస్త్ అడ్మిషన్లు, బయోమె ట్రిక్ హాజరు, పీజీ సెట్‌పై నమస్తే తెలంగాణ తో ముచ్చటించా రు. విద్యార్థులు నిత్యం తరగతులకు హాజరవుతుండటంతో వారిలో సబ్జెక్టు నైపుణ్యాలు పెరగడంతో పాటు జీవితంలో స్థిరపడటానికి కావల్సిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారని ఆ దిశగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, అనుబంద కళాశాలల్లో కచ్చితంగా బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని వీసీలకు ఆదేశాలు జారీ చేశాం. అంతేగాకుండా దేశంలోనే ప్రప్రథమం గా డిగ్రీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహి స్తూ విద్యార్థులకు ఆర్థిక లాభంతోపా టు శ్రమను తగ్గించామన్నారు. దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) సమూలమైన మార్పులు చేసి 2019-20కి అం దుబాటులోకి తెస్తున్నామన్నారు. మే మొదటివారం లో అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసి జులై 2 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకునే విద్యార్థు లు వారి సర్టిఫికెట్లను కానీ, మొబైల్‌కు వచ్చినటువంటి వన్‌టైం పాస్‌వర్డునుకానీ ఎవరికి చెప్పవద్దన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఆరు యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో 2019-20 ప్రవేశానికి ఒకే పీజీ సెట్ నిర్వహిస్తున్నామని ఆ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించామన్నారు. ప్రతి విద్యార్థి ఏ యూ నివర్సిటీలో సీటు కావాలంటే వారి ర్యాంకుల ఆధారంగా సీటు వస్తుందని తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...