పది పరీక్షలకు 68 మంది గైర్హాజర్


Wed,March 20, 2019 02:04 AM

-పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక పరిశీలకుడు సోమిరెడ్డి
-విధుల నుంచి పలువురు ఇన్విజిలేటర్ల తొలగింపు
రామగిరి: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మంగళవారం జరిగిన హిం దీ పరీక్షకు 68 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా పరీక్షలకు 20,587 మంది హాజరుకావల్సి ఉండగా 20,519 మంది హాజరైనట్లు జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ విజయభారతి వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు ఓపె న్ స్కూల్ జేడీ సోమిరెడ్డి పర్యవేక్షించారు. నల్లగొండలోని శ్రీచైతన్య స్కూల్, గంధంవారిగూడెంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఒక్కో ఇన్విజిలేటర్ విధుల పట్ల అలసత్వం వహిస్తుండటాన్ని గమనించి వారిని ఆయన విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా మునుగోడులోని సెయింట్ జోసప్ పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా స్థానికులు ఉండటం, హడావిడి చేయడాన్ని గమనించి ప్రత్యేక సిట్టింగ్ స్క్యాడ్‌లను డీఈఓ సరోజినీదేవి ఆదేశాలమేరకు ఏర్పాటు చేశారు. అయి తే డీఈఓ 11 పరీక్ష కేంద్రాలను, ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు 40 కేంద్రాలను తనిఖీ చేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...