సర్పంచులు పాలనపై అవగాహన కలిగి ఉండాలి


Wed,February 20, 2019 02:28 AM

- గ్రామ ప్రథమ పౌరుడిగా విధులను తెలుసుకోవాలి
-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : నూతన ఎన్నికైన సర్పంచులు తమ పాలన, విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ, టీటీడీసీలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ కార్యక్షికమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్ తమ బాధ్యతను తెలుసుకుని మెలగాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో గ్రామాభివృద్ధికి పాటు పడాలన్నారు. అంకిత భావంతో పని చేస్తు ప్రభుత్వ పథకాలను పేదలకు అందజేస్తేనే మంచి పేరు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. గ్రామంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటు అటు అధికారులు, ఇటు ప్రజలను సమన్వయం చేస్తు ముందుకు సాగాలని సూచించారు.

గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, పాలన, పన్నుల వసూలు, పంచాయతీరాజ్ చట్టాలు, గ్రామస్థాయిలో ప్రభుత్వ అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నెలలో ఒకసారి సమావేశం నిర్వహించడంతో పాటు నిత్యం గ్రామంలో పర్యటించాలని ప్రతి శాఖపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నారాయణడ్డి మాట్లాడుతూ నూతన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్‌ల విధులు,బాధ్యతలు, ఆర్ధిక వనరులు, పన్నులు, పనులు చేపట్టే విధానం, ప్రణాళికలు, డంపింగ్‌యార్డు, హరితహారం, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, నీటికుంటలు, సీసీరోడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్‌డీఓ శేఖర్‌డ్డి, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ట్రెయినీ డీపీఓ విష్ణువర్ధన్, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...