అధినేత అభీష్టం ప్రకారమే..


Wed,February 20, 2019 02:28 AM

-సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు
- ‘ఒక రైతు’గా విద్యుత్ శాఖ బాధ్యతలు సంతృప్తినిచ్చాయి
- నా హయాంలో సాగుకు నిరంతర విద్యుత్ మరిచిపోలేను
- సహకరించిన ప్రజా ప్రతినిధులు, నేతలకు ధన్యవాదాలు
- కేసీఆర్ నిర్దేశమే మా విజయపథం : మంత్రి జగదీష్‌రెడ్డి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ.. ఆయన అభీష్టం మేరకు నడుచుకుంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌డ్డి అన్నారు. మంగళవారం రెండోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జగదీష్‌డ్డి మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో రెండోసారి మంత్రిగా అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శాఖలతో పట్టింపు లేకుండా.. అప్పగించిన పనిని వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. వ్యవసాయదారుడినైన తనకు విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ సంతృప్తిని ఇచ్చిందని.. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నపుడే వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయడం తాను మరిచిపోలేని ఘట్టమని జగదీష్‌డ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంచిన నమ్మకంతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అద్భుతమైన ఫలితాలు సాధించామని.. అన్ని విధాలుగా సహకరించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమన్వయం, సామరస్యంతో అందరినీ కలుపుకుపోవడం ద్వారానే జిల్లాలో అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పిన మంత్రి జగదీష్‌డ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశమే తమను విజయపథం వైపు నడిపిస్తోందని చెప్పారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...