ప్రారంభమైన టీఎన్జీఓస్ రాష్ట్రస్థాయిక్రీడలు


Tue,February 19, 2019 03:14 AM

-ఉమ్మడి 10 జిల్లాల నుంచి పాల్గొన్న 1500 మంది క్రీడాకారులు
-పోటీలను ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీఓ సెంట్రల్
యూనియన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
కరీంనగర్ స్పోర్ట్స్ : టీఎన్జీఓ రెండో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్, గేమ్స్ మీట్-2019 పోటీలు సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు జరిగే పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు తరలివచ్చారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్, ఒలింపిక్ జెండాలను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. అంతకుముందు అమర జవాన్లకు మౌనం పాటించి, నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు విఠల్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇన్‌చార్జి కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షురాలు రేచల్, ఉపాధ్యక్షుడు రాజయ్యగౌడ్, కోశాధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర పోటీల కోఆర్డినేటర్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే
టెన్నికాయిట్‌లో కరీంనగర్‌కు చెందిన క్రీడాకారులు హైమావతి, సునీతాదేవి సెమీస్‌లోకి ప్రవేశించారు. కబడ్డీలో నల్గొండ, మెదక్ జట్ల క్రీడాకారులు తలపడగా నల్గొండ 20 పాయింట్లు, మెదక్ 28 పాయింట్లు సాధించి విజయాన్ని నమోదు చేసుకున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగిన పోరులో ఖమ్మం జిల్లా క్రీడాకారులు 17 పాయింట్లు సాధించగా వరంగల్ జిల్లా క్రీడాకారులు 30 పాయింట్లతో గెలుపొందారు. వాలీబాల్ పోటీల్లో నల్గొండ, వరంగల్ జట్ల మధ్య పోటీ జరుగగా నల్గొండ 25-21, వరంగల్ 25-25 పాయింట్లతో గెలుపొందారు. క్రికెట్‌లో మెదక్, అదిలాబాద్ జట్లు తలపడగా మెదక్ విజయం సాధించగా మరో మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై నిజామాబాద్ జట్టు విజయం సాధించింది. టెన్నికాయిట్ డబుల్ విభాగంలో జరిగిన పోరులో మెదక్‌పై మహబూబ్‌నగర్ క్రీడాకారులు విజయం సాధించారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...