బంగారు తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ : బండా


Mon,February 18, 2019 02:28 AM

ఎంజీ యూనివర్సిటీ : తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణ ప్రదాతగా సీఎం కేసీఆర్ ముందుకుసాగుతూ తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటీకే ఎంజీయూలో నాటిన మొక్కల సంరక్షణకు ఎన్‌ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డా.దోమల రమేష్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలు హర్షణీయమన్నారు. అడవుల విస్తీర్ణంతోనే పర్యావరణ సంరక్షణతోపాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించిన సీఎం కేసీఆర్ ఆలోచనే హరితహారమన్నారు. ఎంజీయూలో నాటిన మొక్కలు పెరిగి భవిష్యత్‌లో హరితవనంగా మారుతుందని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని సూచించారు. అనంతరం యూనివర్సిటీ సైన్స్ అండ్ ఇన్ఫ్‌ర్మాటిక్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 వలంటీర్లు మొక్కలు నాటారు. ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ దోమల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ మాలె శరణ్యారెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, నల్లగొండ ఎంపీపీ దైద రజిత, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల కార్యదర్శి ఎంవీ గోనారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 పీఓ డా.చిల్కూరి రమేష్, టీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్‌వల్లి, అనీస్‌ముక్తాదర్, ఆలకుంట్ల మోహన్, పిల్లి రామరాజు, ఎంజీయూ స్టూడెంట్ వెల్పేర్ ఆఫీసర్ ఎల్.మధు, వీసీ పీఏ రాంరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ జిల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...