మరణానంతరం మరొకరికి జీవం పొద్దాం


Mon,February 18, 2019 02:28 AM

- నేత్రదానంతో మరో ఇద్దరికి వెలుగునిద్దాం
- అవయవదానంపై అందరికీ అవగాహన కల్పిద్దాం
- అమరజవానులకు నివాళిగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రద్దు
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్
- నమస్తే తెలంగాణ, టీన్యూస్, జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం
- పేటలో ప్రారంభం రోజే 108మంది దాతలు నమోదు
సూర్యాపేట టౌన్ : మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవం పోసేలా అందరూ అవయవ దానం చేయాలని ప్రోత్సహిస్తూ అందరిలో అవగాహన కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత నమస్తే తెలంగాణ, టీన్యూస్, జాగృతి భాగస్వామ్యంతో చేపట్టిన అవయవదాన కార్యక్రమం మరో సంచలనాత్మకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తగా నమస్తే తెలంగాణ, టీన్యూస్, జాగృతి భాగస్వామ్యంతో సంచలనాత్మకంగా చేపట్టిన అవయవదాన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని మిర్చియార్డులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి అన్నిరంగాల అభివృద్ధితోపాటు అందరిలోనూ సేవాతత్వం పెరిగిందన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నేత్రదానంతో మరో ఇద్దరికి వెలుగునిచ్చే అవకాశం ఉందని.. గుండె, కాలేయం తోపాటు పలు అవయవాల మార్పిడితో వేలాది మందికి మరో జన్మనందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాన్ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సకారంతో జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగించుకుందామన్నారు.
అనంతరం జీవన్‌దాస్ అవయవదాన కేంద్రం పోస్టర్‌ను ఆవిష్కరించి అవయదానాన్ని ప్రోత్సహిస్తున్న పలువురిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బైరబోయిన శ్రీను, వైద్య, ఆరోగ్య ఉద్యోగుల అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు భూతరాజు సైదులు, బీరవోలు శ్రీహర్ష, సల్వాది శ్రీనివాస్, బైరు రమేష్, మిట్టకోల కోటయ్య, గుండా వెంకటప్పయ్య, నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ జాగృతి బృందం కంచుగట్ల ప్రవీణ్, పెద్దింటి శ్యాంసుందర్‌రెడ్డి, పకీరు సైదిరెడ్డి, అమరగాని నాగేందర్, పల్లేటి నాగార్జున, కొడిదల రాజు, చంద్రశేఖర్, లక్ష్మణ్, సోమన్న, రమేష్, శ్రీనివాస్‌గౌడ్, రమాకిరణ్, సత్యనారాయణ, లక్కరాజు ప్రవీణ్, మస్తాన్, శ్యాంనాయుడు, నాగునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్, మల్లం చైతన్య, నీలా ఉమారాణి, సల్వాది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...