19 నుంచి నూతన సర్పంచులకు శిక్షణ


Sun,February 17, 2019 03:05 AM

-మార్చి 23 వరకు తరగతులు
-టీటీడీసీ, డీఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహణ
నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి మార్చి 23 వరకు శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గత నెలలో జిల్లావ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీల్లో 837 పంచాయతీలకు మూడు విడుతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గెలుపొందిన సర్పంచులకు మండలాల వారిగా ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు పంచాయతీ పాలన చేపట్టే విధులు సర్పంచుల పాత్ర పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ, డీఆర్‌డీఓ కార్యాలయంలో శిక్షణ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు తిప్పర్తి, కనగల్, నల్లగొండ, మునుగోడు, నార్కట్‌పల్లి మండల సర్పంచులకు, 25 నుంచి మార్చి 1 వరకు కట్టంగూర్, శాలిగౌరారం, కేతెపల్లి, నకిరేకల్, చిట్యాల, అడవిదేవులపల్లి, దామరచర్ల మండల సర్పంచులకు, మార్చి 5 నుంచి 9 వరకు అనుముల, తిరుమలగిరి సాగర్, నిడమనూరు, పెద్దవూర, వేములపల్లి, మిర్యాలగూడ మండల సర్పంచులకు, 11 నుంచి 15 వరకు మాడ్గులపల్లి, త్రిపురారం, దేవరకొండ, నేరెడుగొమ్ము, మర్రిగూడ, డిండి మండలాలు, 18 నుంచి మార్చి 23 వరకు కొండమల్లేపల్లి, గుర్రంపోడు, చందంపేట, చింతపల్లి, పీఏపల్లి, నాంపల్లి మండల సర్పంచులకు అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు గాను 15 మందిని శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఇందులో ఎంపీడీఓలు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఎన్జీఓలు ఉన్నారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...