ఈనెల 18 నుంచి టీసీసీ పరీక్షలు


Sat,February 16, 2019 02:28 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఈ నెల 18 నుంచి 21 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు విభాగంలో డ్రాయింగ్, టైలరింగ్‌లో లోయర్, హయ్యర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సరోజినిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే టైలరింగ్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రాయింగ్ లోయర్ అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ నిర్మలా విద్యామందిర్, గడియారం సెంటర్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, మిర్యాలగూడ రోడ్డులోని డైట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ విభాగంలో దేవరకొండరోడ్డులోని సెయింట్ ఆల్పెన్స్ స్కూల్‌లో సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హయ్యర్ డ్రాయింగ్ అభ్యర్థులు దేవరకొండరోడ్డులోని ప్రభుత్వ బాలుర పాఠశాల, టైలరింగ్ ఎంబ్రాయిడరీ అభ్యర్థులకు శాంతినగర్‌లోని లిటిల్ ప్లవర్ హైస్కూల్‌లో సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు తీసుకుని పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కుట్టుమిషన్లు తెచ్చుకోవాలని సూచించారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...