ఇక గురువుల ఎన్నికలు..


Thu,February 14, 2019 02:50 AM

-నోటిఫికేషన్‌కు ముందే జోరందుకున్న ప్రచారం
-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో స్వతంత్రులు సైతం..
-నియోజకవర్గంలో 18,000కుపైగా ఓటర్లు
-ఈనెల 20న తుది ఓటర్ల జాబితా
రామగిరి: రాజకీయహోరులో ఎమ్మెల్యే, సర్పంచ్‌ల ఎన్నికలు ముగిశాయి. ఇక పంతుళ్ల వంతు రానుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చిలో ఈ నియోజక వర్గ ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తున్న విషయం ఉపాధ్యాయ లోకానికి విధితమే. అయితే ఈ ఎన్నికలు ఉపాధ్యాయ సంఘాల మధ్యనే సాగుతాయి. నోటిఫికేషన్ రాకముందే ఆయా సంఘాల నేతలు ప్రచారాన్ని షురూ చేశారు. నోటిఫికేషన్ వెలువడగానే ఈ ప్రచారం ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల బరిలో టీఎస్‌పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్ బలపర్చిన అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా రాజకీయాలకతీతంగా సాగే ఉపాధ్యాయ ఎన్నికలు ప్రత్యేక ఆసక్తిగా సాగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి-2019తో ముగుస్తుంది. దీనిలో భాగంగా ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఈగడువు జనవరి 31తో ముగియగా 18,250 మంది ఆన్‌లైన్‌లో, మ్యాన్యువల్‌గా దరఖాస్తులను చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓట ర్ల నమోదులో ఉపాధ్యాయ సంఘాలన్ని కూడా తమ తమ సంఘాల పరిధిలోని ఉపాధ్యాయులతో ఓటర్లుగా నమోదు చేయించారు. ఈనెల మూడో వారం లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ప్రచారాన్ని షురూ చేయడం విశేషం.

నియోజక వర్గంలో 18వేలకు పైగా ఓటర్లు...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 6, 2018 వరకు దరఖాస్తులను స్వీకరించగా 18,536 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందినట్లు సమాచారం. వీటిలో స్కూటిని చేయగా 17,069 మంది దరఖాస్తులను ఎన్నికల కమిషన్ ఆమోదించిన ట్లు తెలుస్తోంది. కాగా వీటిలో దరఖాస్తులు చేసిన వారు జిల్లాల వారిగా చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 6,665 ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 7,556, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 4,315 మంది దరఖాస్తులు చేశారు. అయితే ఇందుకు సంబంధించి తుది జాబితా మాత్రం ఈనెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. దీంతో ఓటర్ల లెక్క పక్కాగా తేలనుంది.

బరిలో నిలువనున్న వారు ...
ప్రస్తుతం నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పూల రవీందర్‌ను టీఎస్‌పీఆర్టీయూ అభ్యర్థ్ధిగా ఆ సం ఘం రాష్ట్ర నాయకత్వం డిక్లర్ చేసింది. దీంతో ఆయన బరిలో ఉండనున్నారు. అదేవిధంగా టీఎస్‌యూటీఎఫ్ నుంచి ఆ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీయూ తెలంగాణ, కేజీ టు పీజీ టీచర్స్ అసోసియేషన్ ఆచార్య అధ్యాపక అసోసియేషన్ అభ్యర్థ్ధిగా వరంగల్‌కు చెందిన సంగెం మల్లేశ్వర్, నల్లగొండ పీఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షు డు స్వతంత్ర అభ్యర్థ్ధిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మరో స్వతంత్య్ర అభ్యర్థ్ధిగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ ఏలె చంద్రమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరు ప్రచారాన్ని సాగిస్తూనే ఇప్పటికే ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి తమకు తొలి ప్రాదాన్యత ఓటును వేయాలని అభ్యర్థ్ధిస్తున్నారు. మరోవైపు టీఎస్ టీఎస్‌పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్ నుంచి పోటికి రంగంలో ఉన్న ఇద్దరు నల్లగొండ జిల్లా వాసులే కావడం గమనార్హం. ఇదిలాఉంటే ఆయా సంఘాల నాయకులు ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి తమకు ఓటేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు.

అంతటా చర్చ..
రాజకీయ వేడిలో సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇక పంతుళ్ల ఎన్నికలపై చర్చ జరుగుతోంది. సమాజానికి దిశానిర్దేశం చేస్తు భావిభారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు తమకు అండగా ఉండే నాయకులను ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంఘాలన్నింటిలో ప్రధాన చర్చ సాగుతోంది. ఉపాధ్యాయుల పక్షాన సుదీర్ఘంగా పోరాటం చేస్తు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి పలు జీఓలు, పీఈటీల, పం డిట్ల అప్‌గ్రేడేషన్‌కు సహకరించిన ప్రస్తుత ఎమ్మె ల్సీ పూల రవీందర్ విజయం తధ్యమని పీఆర్టీయూ నేతలు ముక్తకంఠంతో వెల్లడిస్తుండటం విశేషం. ఏదేమైనా నోటిఫికేషన్ వస్తే ప్రచారం ఊపందుకోనుంది.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...