మాదక ద్రవ్యాల నివారణలో యువతది కీలప భూమిక


Wed,February 13, 2019 01:48 AM

-ఎంజీయూ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్
-హాజరైన రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి
ఎంజీయూనివర్సిటీ : మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) నివారణలో యువతే కీలక భూమిక పోషించి ప్రజలను వాటి నుంచి సంభవించే దుష్పరిణామాలపై చైతన్యం చేయాలని ఎంజీయూ వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిపెన్స్ (ఎన్‌ఐఎస్‌డీ) ఆధ్వర్యంలో ఎన్‌వైకే వలంటీర్లు, యూత్ లీడర్లకు సబ్ స్టెయిన్స్ అబ్యూజ్ ప్రివెన్షన్స్ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితమే నాశనమవుతుందని తెలిపారు. ఎన్‌వైకే వలంటీర్లకు, యువతకు ఈ విషయంపై అవగాహన కల్పించి ఎంజీయు ఆర్ట్స్ కళాశాల ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి సామాజిక రుగ్మతలను సమాజం నుంచి పారదోలాలన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీహార్ వంటి రాష్ర్టాల్లో మాదక ద్రవ్యాలను నివారించడం వలన 10శాతం ప్రమాదాలు, 20 శాతం దొంగతనాలు తగ్గడమే గాక 200 శాతం పాల అమ్మకం పెరిగిందన్నారు. ఎంజీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సమావేశం కన్వీనర్ ఎల్. మధు, నెహ్రూ యువ కేంద్రం వలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

295
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...