ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Wed,February 13, 2019 01:47 AM

-మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
-పెన్‌పహాడ్‌లో రూ.87లక్షల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
పెన్‌పహాడ్ : 14ఏండ్లు గత ప్రభుత్వాల ఎగతాలిని తట్టుకొని కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని.. వచ్చిన తెలంగాణలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నివర్గాలకు సమాన లబ్ధి చేకూరేలా ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సత్య గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 83మందికి కల్యాణలక్ష్మి, 17మందికి షాదీముబారక్ సంబంధించిన రూ.87లక్షల165వేల చెక్కులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ.. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముకని పేర్కొన్న గత ప్రభుత్వాలు రైతు నడ్డి విరిచాయన్నారు.

కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రైతే రాజుగా చూడాలనుకున్న కేసీఆర్ స్వప్నం నెరవేరిందన్నారు. అందులోభాగంగానే రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రైతు ప్రమాదశాత్తు చనిపోతే ఆకుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా పథకం కింద రూ.5లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పద్మ, ఆర్డీఓ మోహన్‌రావు, తహసీల్దార్ ప్రమీల, ఎంపీడీఓ సీతాకుమారి, సర్పంచ్‌లు తూముల స్వేత, నెమ్మాది భిక్షం, షాలీబాయి, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బిట్టు నాగేశ్వర్‌రావు, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, బొల్లక సైదమ్మ, తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, వావిళ్ల రమేష్, అధికారులు పాల్గొన్నారు.

229
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...