రెవెన్యూ ఫిర్యాదులపై దృష్టి సారించాలి


Tue,February 12, 2019 01:10 AM

-సమస్య పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వస్తున్నారు
-ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలి
-గ్రీవెన్స్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులు, ఫిర్యాదులలో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలే అధికంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. రెవె న్యూ సమస్యలు కోరుతూ వచ్చిన వారే వ స్తున్న నేపథ్యంలో పునరావృతం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ఆ శాఖ యం త్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా జేసీ నారాయణరెడ్డితో కలిసి పలు వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాను రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలంటే అర్జీలను కూలంకషంగా పరిశీలించి మరుసటి రోజు అన్ని మండలాల డిప్యూటీ తహసీల్దార్లు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ దశల వారీగా వీటిని పరిష్కరించాలని...సమస్యలు పరిష్కారమైన గ్రామాలను రెవెన్యూ రహిత గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు. అంతేగాక ఇప్పటి వరకు భూ రికార్డుల ప్రక్షాళనలో నవీకరించిన పహాని 1-బీలను రెవెన్యూ గ్రామాల్లో వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజావాణికి అధికారులంతా హాజరు కావాలని, రాలేని వారు ముందే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజావాణి అర్జిలను పరిష్కరించిన అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్, ఉపాధి కల్పన అధికారి పద్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

పలు అంశాలపై వినతులు..
గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డిలకు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు పలు అంశాలపై విన్నవించారు. అందులో ప్రధానంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని, నూతన పింఛన్లు మంజూరుచేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని బాధితులు కోరారు. పీఎంఈజీపీ పథకంతో పాటు నాబార్డు ద్వారా రుణాలు ఇప్పించాలని కోరడంతో పాటు సబ్సిడీ కాంపోనెంట్‌పైన పలు దరఖాస్తులు వచ్చాయి.

328
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...