పోలీస్ ఈవెంట్స్ ప్రారంభం


Tue,February 12, 2019 01:10 AM

-600 మందికి గాను 103 మంది గైర్హాజర్
-425 మంది అర్హత l పర్యవేక్షించిన ఎస్పీ రంగనాథ్
నల్లగొండక్రైం : పోలీస్ ఉద్యోగాలకై ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి ఈవెంట్స్‌లో పాల్గొన్న అభ్యర్థుల్లో 85 శాతం మంది అర్హత సాధించారు. తొలి రోజు 600 మందికి గాను 497 మంది హాజరుకాగా అందులో 425 మంది అన్ని విభాగాల్లోనూ లక్ష్యాన్ని చేరుకుని అర్హత సాధించారు. ఉదయం 4.30 గంటలకు అభ్యర్థులంతా స్థానిక మేకల అభినవ్ స్టేడియానికి చేరుకున్నప్పటికీ తొలి రోజు కావడంతో పోలీస్ యంత్రాంగం కాస్త సమయం ఇచ్చి 6గంటలకు ప్రారంభించింది. సుమారు 10 గంటల నిడివిలో పలువురు అభ్యర్థులకు కేటాయించిన సమయాన్ని బట్టి ఈవెంట్స్ నిర్వహించారు. అయితే ఉదయం నుంచే ఈవెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఏవీ రంగనాథ్ స్టేడియానికి వచ్చి పర్యవేక్షించి పరిశీలించారు.

85శాతం మంది అభ్యర్థులు అర్హత
ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామకం దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి మార్చి 13 వరకు నిర్వీరామంగా ఈవెంట్స్ కొనసాగనున్నాయి. తొలి రోజు 600 మంది అభ్యర్థులకు ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అయితే 600 మందికి గాను 497 మందే ఈవెంట్స్‌కు హాజరు కాగా మిగిలిన 103 మంది అభ్యర్థులు అనివార్య కారణాల నేపథ్యంలో గైర్హాజరయ్యారు. అయినప్పటికి మరోసారి వీరికి సమయం ఇవ్వనున్నట్లు పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 497 మందిలో 425 మంది (85 శా తం) అన్ని ఈవెంట్స్‌లో ను పాల్గొని అర్హత సాధించారు. 75 మంది పలు విభాగాల్లో రాణించలేక వెనుదిరగాల్సి వచ్చింది.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగవద్దనే ఉద్దేశంతో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఈవెంట్ వద్ద బయో మెట్రిక్ పద్దతిని అమలు చేయడంతో పాటు ఆర్‌ఎఫ్‌ఐడీ డిజిటల్ విధా నం ద్వారా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు.
సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ....
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించింది. తొలి రోజు పోలీస్ ఈ వెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులకు గాయలైనట్లయితే ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆరోగ్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. ఈ ఈవెంట్స్ ను ఎస్పీ రంగనాథ్ ఎప్పటికప్పు డు పర్యవేక్షించగా ఏఎస్పీ పద్మనాభరెడ్డి నోడల్ అధికారిగా దేహదారుఢ్య పరీక్షలను పరిశీలించారు. డీఎస్పీ సు రేష్‌కుమార్, గంగారా మ్, సీఐలు వెంకటేశ్వర్‌రెడ్డి, పార్థసారధి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు వైవీ ప్రతాప్, సర్పజన్‌రాజు, శంకర్, నర్సింహాచారితో పాటు పలువురు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...