విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు


Tue,February 12, 2019 01:09 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, గొల్లగూడ అంగన్‌వాడి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్బిణులు, బాలింతలు, పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం టీచర్,ఆయాలు రెగ్యులర్‌గా వస్తున్నారా..గుడ్లు అందిస్తున్నారా.. అంటూ ఆరా తీశారు. విధులు సక్రమంగా నిర్వహించడంతో పాటు వారికి కేటాయించిన సరుకులను అందజేయాలని, మెనూ ప్రకారం ఆహారం పెట్టాలని ఆదేశించారు. అనంతరం బొట్టుగూడ పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ఉపాద్యాయుల, విద్యార్థుల సంఖ్యను తెలుసుకుని హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిచారు. అనంతరం తరగతి గదులను సైతం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పలు తరగతి గదుల్లో లైట్లు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిని మందలించారు. లైట్లు వేయకపోతే విద్యార్థుల కంటి చూపుపై ప్రభావం పడుతుందని వెంటనే లైట్లు వేయించాలని ఆదేశించారు. పాఠశాల అభివృద్ధి కోసం వచ్చే నిధులతో మౌళిక సౌకర్యాలు కల్పించాని, దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలను తరచుగా పర్యవేక్షించాలని ఎంఈఓ నర్సింహను ఆదేశించారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...