అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి


Tue,February 12, 2019 01:09 AM

-అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పరిశీలించాలి
-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
రామగిరి: వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలును తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14,15తేదీల్లో మండల పర్యవేక్షక అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి నిర్ణీత ప్రొఫార్మా అనుసరించి సౌకర్యాలు పరిశీలించాలన్నారు. ఏ వసతి గృహం తనిఖీ చేయాలనే విషయాన్ని ర్యాండమైజ్‌చేసి సమాచారం అందిస్తామన్నారు. తనిఖీ సందర్భంగా మొత్తం విద్యార్థులు ఎంత మంది ఉన్నారు, స్టాక్ రిజిస్టర్, స్టాక్ పరిశీలన, ఎన్ని జతలు డ్రస్‌లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారనే వివరాలతో పాటు మెనూను పరిశీలించి నివేదికలు పంపాలన్నారు. వసతి గృహ విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలన్నారు.

గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు పరిపాలన అనుమతి మంజూరు చేశామని, విద్య సంక్షేమ మౌళిక వసతుల ఇంజినీరింగ్ విభాగం పనులు చేయడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెండర్లు పిలిచి సత్వరమే పూర్తి చేయాలన్నారు. తాను కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు. పాఠశాలలు, దవాఖానలు, అంగన్‌వాడి కేంద్రాలు, వసతి గృహాలు, పశువైద్యశాలలు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖ ఉన్నతాదికారులు మండలాల్లో పర్యటించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. జాతీయ బోధకాల నివారణ కార్యక్రమంలో భాగంగా వ్యాధి నివారణకు సామూహిక ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ, విద్యాశాఖలు సహకరించాలన్నారు. సమావేశంలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్, పరిశ్రమల శాఖ జీఎం కోటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...