పాతగుట్టలో అధ్యయనోత్సవాలు షురూ


Tue,February 12, 2019 01:09 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలకు అర్చకులు స్వస్తీవాచనంతో సోమవారం శ్రీకారం పలికారు. మొదటిరోజు శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని మత్స్యావతారంలో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఆళ్వారులు కొలువుదీరి ఉన్నందున దివ్యప్రబంధ అధ్యయన ఉత్సవం ప్రబంధ పారాయణీకులచే నిర్వహించా రు. సాయంత్రం కూర్మావతారంలో అలంకరించి శ్రీవారిని ఊరేగించారు. నిత్యారాధనలు, ఆళ్వారాదుల దివ్య ప్రబంధ పాశురములను తొళక్కము వేడుకలు పారాయణీకులు పారాయణం గావించారు. దశావతారాల్లో మత్స్యవతారంనకు సంబంధించిన పాశురములు పఠించారు.

మత్స్యావతార విశిష్టత
బ్రహ్మ నుంచి సోమకాసురుడనే రాక్షసుడు వేదములను అపహరించినప్పడు శ్రీమన్నారాయణడు మత్స్యావతారము ధరించి సముద్రపు అడుగు భాగములో దాగిన దానవుడిని సంహరించి సృష్టికర్తయ్తెన బ్రహ్మదేవుడికి వేదరాశిని అందజేసిన అవతారమే మత్స్యావతారము. వేదరాశి ఉద్ధరణ, ధర్మరక్షణ,సృష్టిక్రమ నిర్వహణ మొదలగు ఎన్నో విశేషములతో పాటు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్న అవతారము మత్స్యావతారము. భాగవతములో ఒక ప్రత్యే తను సూచిస్తూ అమ్మవారి కంటి సాందర్యం తాను ధరించవలెనని భగవానుడు మత్స్యాకంటిగా అవతరించాడని పెద్దల రసోక్తి, ఈ మత్స్యనారసింహుడుగా భక్తికోటిని అనుగ్రహించడం ప్రత్యక్ష నిదర్శంగా కన్పిస్తుంది. మ త్స్యాగిరిలో ఈ అలంకార అవతార సేవలో సాక్షాత్తు మత్స్యానారసింహ దర్శనం సర్వసంపదకరమని పురాణాల్లో పేర్కో నబడింది. వార్షిక ఆలయములో నిత్య కైంకర్యముల అనంతరం శ్రీ స్వామి వారిని కూర్మావతారములో అలంకరించి తిరువీధులలో భక్తుల దర్శనార్థంఊరేగించారు.

శ్రీ కూర్మావతార విశిష్టత
దశావతారంలో రెండో అవతారంగా శ్రీమద్భాగవతంలో వ్యాస భగవానుడిచే పేర్కొనబడిన శ్రీకూర్మావతారం ఎంతో విలక్షణమైనది. క్షీరసాగర మద న సందర్భంలో మందర పర్వతం సముద్రంలో ని లపగా నీటిలోనికి జారిపడు వేళలో ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు కమట పృష్టము తో శ్రీ కూర్మరూపం ధరించి పర్వత మును తన వీపుపై నిలుపుకుని అపూర్వమైన సంపద లోకములను అందించడానికి ఎంతో ప్రయాసపడి దేవతల అభీష్టములను ధర్మరక్షణను గావించిన విలక్షణతత్తముగా శ్రీకూర్మావతారం పేర్కొంటారు. అన్నమ య్య శ్రీ కూర్మ అవతారం వర్ణిస్తూ పొడగంటిమ య్యా నిన్ను పురుషోత్తమా అంటూ కీర్తించుట ఈ అవతార ప్రత్యేకతను చెప్పకనే చెబుతున్నది. కార్యక్రమంలో ఆ లయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ.నర్సింహమూర్తి, ఏఈఓలు భాస్కరశర్మ, వేముల రామ్మోహన్, సూపరింటెండెంట్ మేడి శివకుమార్, ప్రధానార్చకుడు కారంపూడి నర్సింహాచార్యులు, స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఉప ప్రధానార్చకుడు బట్టర్ సురే ంద్రాచార్యులు, ముఖ్య అర్చకులు మాధవాచార్యులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...