అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం


Tue,February 12, 2019 01:09 AM

- ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు చర్యలు
- నియోజకవర్గ అభివృద్ధికి రూ.33 కోట్ల
- కమీషన్ల కోమటిరెడ్డికి విమర్శించే అర్హత లేదు
-విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల
- వచ్చే ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి: బండా
నల్లగొండ, నమస్తే తెలంగాణ: నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతోపాటు నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అబివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముం దు నల్లగొండను దత్తత తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అనేక నిధులు కేటాయించినట్లు తెలిపా రు. ఎన్నికల ముందే పట్టణాభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించి రూ.100 కోట్లు విడుదల చేయగా తాజాగా పట్టణం, మండలాల అభివృద్ధి కోసం రూ.33 కోట్లు విడుదల చేసినట్లు తెలిపా రు. తన సొంత నిధులైన ఎస్‌డీఎఫ్ ఫండ్‌తో ఈ నిధులను ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయ న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజీలు, ఫార్మేషన్ రోడ్లు వేస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తం గా ఉన్నటువంటి 93 గ్రామ పంచాయతీలకు గానూ 72 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రూ.నాలుగు కోట్లతో మామిడాల, ఎల్లమ్మగూ డెం, మధ్యలో పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం, రూ.50 కోట్లతో పానగల్ రిజర్వాయర్ అభివృద్ధి, రూ.116 కోట్లతో ఇంటింటికి తాగునీరు, రూ.2 50 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 20 ఏళ్లు దోచుకున్న కోమటిరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కమీషన్లతో కడుపులు నింపుకునే కోమటిరెడ్డికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన నల్లగొండే కాదు భువనగిరిలో పోటీ చేసి నా ఓటమి తప్పదన్నారు. అనంతరం టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలు వచ్చే ఎన్నికల్లోను అదేస్థాయిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చిన హామీలను విస్మరించకుండా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధ్ది చేయాలని ప్రతీపథకాన్ని కిందిస్థాయికి తీసుకెళ్లాలన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...