పాడిరైతులకు బర్రెలు..


Mon,January 14, 2019 03:35 AM

-జిల్లాలో ముమ్మరంగా ప్రభుత్వ సబ్సిడీ బర్రెల పంపిణీ
-14632 మందికి గాను ఇప్పటికే 3109 మందికి అందజేత
-ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ
-నాలుగు శాతం గ్రాంట్ పొందిన రైతులందరికీ మంజూరు
-రెండో విడుతగా మరికొంత మందికి అవకాశం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: మనిషి రెగ్యులర్ కనీ సం 275 మి.లీ.పాలు తీసుకుంటేనే పోషకాహారం లభిస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి విశేష కృషి చేస్తుంది. అంతేగాక పాల ఉత్పత్తి పెరిగితే పాడి రైతాంగం కుటుంబంలో సైతం వెలుగులు నిండుతాయనే ఉద్ధేశంతో ఆ దిశగా ప్రణాళికలు చేపట్టింది. ఇప్పటికే ఒకటి, అంతకు మిం చి బర్రెలు ఉండి పాల దిగుబడి పొ ందుతున్నటువంటి రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై మరో బర్రెను అందజేస్తోంది. విజయాడైరీ, మదర్ పాలు పోసే రైతుల జాబితాను సేకరించి 4 శాతం గ్రాంటు పొంది న వారందర్ని గుర్తించి సబ్సిడీ బర్రెలు అందిస్తుంది. జిల్లాలో 14,632 మంది ఉండగా వీరందరికి గత ఏడాది జూలై 1న ఒకే రోజు అందరికి మంజూరు చేయ గా వారికి సబ్సిడీ బర్రెలను అందజేసే కార్యక్రమం లో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.

జిల్లాలో 3,109 గేదెల పంపిణీ..
రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ బర్రెలను పంపిణీ చేసి పాడి రైతాంగాన్ని ప్రోత్సహించాలని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ బర్రెలను మదర్ విజయాడెయిరీ, ముల్కనూర్ సొసైటీ ద్వారా అం దజేసేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మదర్, విజయాడైరీ పాల సొసైటీలు మాత్రమే ఉండటంతో ఆ సొసైటీల్లో ఉన్నటువం టి సభ్యులకు ఈ బర్రెలు ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ రెండు సంస్థలకు పాలు పోస్తు తెలంగాణ ప్రభు త్వం ఇచ్చే 4శాతం గ్రాంటును పొందిన రైతుల జాబితాను సేకరించింది. మొత్తంగా 14,632 మంది ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారందరికి గత ఏడాది జూలై 1వ తేదీన ఒకటేసారి మం జూ రు నిచ్చింది. అందులో ఇప్పటివరకు 3241 రైతుల నుంచి పశు సంవర్థక శాఖ యంత్రాంగానికి డీడీలు అందాయి. వీటిలో 3142 మంది మదర్ రైతులుండగా 93 మంది విజ యా డైరీ రైతులు ఉన్నారు. అయితే 3142 మంది డీడీ లు తీయగా అందులో 3109 మంది రైతులకు ఇప్పటి వరకు ఈ సబ్సిడీ గొర్రెలను అధికారులు కొనుగోలు చేసి అందజేశారు.

50నుంచి75శాతం వరకు సబ్సిడీ..
పాల ఉత్పత్తిని పెంచాలంటే మేలు రకమైన బర్రె లు అవసరమని భావించిన ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూయిచింది. అయి తే మేలు రకమైన బర్రెలు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు ధర పలుకుతుండటంతో వాటినే కొనే ప్ర యత్నం చేస్తు రైతులకు స బ్సిడీ ఇస్తుంది. రూ. 80 వేల యూ నిట్ కాస్టు నిర్ణయించి అందులో ఎస్సీ,ఎస్టీ రైతులకు 75 శాతం సబ్సిడీ , బీసీలతో పాటు ఇతర రైతాంగానికి 50 శాతం సబ్సిడీ అందజేస్తోంది. అంటే ఎస్సీ, ఎస్టీరైతులు రూ. 80 వేలకు గాను రూ. 20 వేలు ,బీసీ, ఇతర రైతులు రూ. 40 వేలు చెల్లిస్తే బర్రెను అందజేస్తున్నారు.

దాణా, ఇన్సూరెన్స్ సౌకర్యం..
జిల్లాలో గుర్తించిన పాడి రైతాంగానికి బర్రెలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటికి మూడు నెల ల పాటు దాణా ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ సౌక ర్యం కల్పించింది. 50 శాతం నుంచి 75 శాతం వరకు సబ్సిడీని అందజేస్తు మూడేళ్ల పాటు ఇన్సూరెన్స్ చేసిం ది. సబ్సిడీ బర్రెకు ట్యాగ్ వేసిన యంత్రాంగం అది మృతి చెందింతే ట్యాగ్ ఆధారంగా పూర్తి స్థాయి సొమ్మును క్లెయిమ్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. సబ్సిడీతో మేలు రకమైన బర్రెను అందజేయడంతో గరిష్టంగా పాలు వస్తున్నాయని , దీంతో తమ బతుకులు ఇక మారినట్లే అని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడు రోజు 6 నుంచి 8 లీట ర్లు పోస్తున్ననేపథ్యంలో రూ. 300 నుంచి 400 ఆదా యం పొందుతున్నారు.
డీడీలు కట్టిన వారందరికీ బర్రెలు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మదర్ డెయిరీ, విజయాడెయిరీల ఆధ్వర్యంలో డీడీలు కట్టిన లబ్ధిదారులందరికీ గేదెలను సబ్సిడీపై అందజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుండగా బీసీ, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అయితే సబ్సిడీలు తీసుకునేటటువంటి రైతులకు మేలురకమైన గేదెలను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
-శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్ అధికారి

604
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...