గెలుపే లక్ష్యంగా పనిచేయాలి


Mon,January 14, 2019 03:33 AM

-పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులను గెలిపించుకోవాలి
-రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా
-దామరచర్లకు చెందిన 200 మంది టీఆర్ చేరిక
మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : గ్రామ పంచాయతీల్లో టీఆర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోము సైదిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ సమక్షంలో టీఆర్ పార్టీలో చేరారు. వారికి వారు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. గత ఐదేళ్ల టీఆర్ ప్రభుత్వ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు ఆసరా ఇచ్చిందన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతులకు చేయూత ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక చేయూత నిచ్చారని కొనియాడారు. మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీ సోము నర్సమ్మ, రాము, గోవిందరెడ్డి, రవిందర్ శ్రీనివాసరావు, సాంబశివరా వు, శేఖర్, హనుమంతరావు, నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు. కా ర్యక్రమంలో నాయకు లు దుర్గంపూడి నారాయణరెడ్డి, కుందురూ వీరకోటిరెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, బైరం నర్సయ్య, దారగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...