టీఆర్ ఒక్కటే


Sun,January 13, 2019 02:08 AM

-పల్లెల్లో పంచాయతీ సందడి.. ప్రతిపక్షాల్లో శూన్యం
-కంటికి కూడా కనిపించని ఇతర రాజకీయ పార్టీలు
-గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలాయనం
-జిల్లా అంతటా టీఆర్ బలపర్చాలని తీవ్ర పోటీ
-కాంగ్రెస్, సహా ఇతర పార్టీలకు అభ్యర్థులు కరువు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సార్వత్రిక ఎన్నికల జోష్ పోకముందే స్థానిక ఎన్నికలు రావడంతో ఎన్నికల కోలాహళం గ్రామాల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. ప్రధానంగా టీఆర్ పార్టీలో గత ఎన్నికల ఫలితాలు ఉత్సాహానిస్తూ ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం ఎక్కువగా భరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని గ్రామాల్లో టీఆర్ నుంచి డబుల్ డిజిట్ ఆశావహులు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని నేతల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీఆర్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఆశావహులకు సర్దిచెప్పి సమన్వయంతో బరిలోకి దించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ అనుకూల ఫలితాల కోసం కృషి చేస్తున్నారు.

టీఆర్ మద్దతు కోసమే ప్రయత్నాలు...
జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి షురూకావడంతో అధికార పార్టీ అయిన టీఆర్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మంచి విజయాన్ని చేకూర్చడంతో ఆదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లోనూ విజయ బాహుట ఎగురవేయాలని టీఆర్ శ్రేణులు ఊవ్విళ్లూరుతున్నారు. ఇన్నాళ్లు న్యూట్రల్ ఉన్న వారు సైతం సర్పంచ్ పోటీ చేస్తే టీఆర్ నుంచే చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న దేవరకొండ, 25న మిర్యాలగూడ, 30న నల్లగొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 837 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనుండగా ప్రతి గ్రామంలోనూ టీఆర్ నుంచి పోటీ చేయడానికి 5 నుంచి 10మంది ఆశావహులు ఆ పార్టీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ అన్నివర్గాల మద్దతున్న వారికి అవకాశం కల్పిస్తూ మిగిలిన వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

నియోజకవర్గాలకు మొహం చూపని కాంగ్రెస్ నేతలు...
గత నెల డిసెంబర్ 7న జరిగిన సార్వత్రిక ఎన్నికలు.. 11న వెలువడిన ఫలితాలు మహాకూటమినుంచి బరిలోకి దిగిన అభ్యర్థులకు చేదు వార్తను మిగిల్చింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి నియోజకవర్గాలకు రావాలంటేనే రాలేని పరిస్థితి. ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు ఎన్నికల ఫలితాల అనంతరం తమ నియోజకవర్గాలకు రాలేకపోవడంతో కార్యకర్తలు సైతం స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి దైర్యం చాలడం లేదు. సీఎల్పీ నేతతో పాటు ఉపనేత సైతం తమ నియోజకవర్గాలకు రాలేక మొఖం చాటేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఓటమి పాలైన 9మంది అభ్యర్థులు ఒకటి రెండుసార్లు మినహా పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. పైగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అయ్యి నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నప్పటికీ కంటికి కనిపించడం లేదు. అయితే ఎన్నికల నాటికి ప్రచారానికైనా వస్తారా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తుంది.

ఇతర రాజకీయ పార్టీల్లోనూ సందడి కరువు...
జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తల్లోనూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దగా సందడి కనిపించడంలేదు. తెలుగుదేశం జాడేలేకపోగా సీపీఎం, సీపీఐ ఇతర పార్టీల్లోనూ పంచాయతీ సందడి కరువైందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కూటమి కట్టినప్పటికి ఉపయోగం లేకపోగా ఈసారి గ్రామాల్లో టీఆర్ ఎదుర్కోవడం కష్టమేనని భావించి ఆయా పార్టీలు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు దూకుడును ప్రదర్శిస్తూ తమ అభ్యర్థిత్వం కోసం ఆరాటపడుతుండగా ఇతర పార్టీ నేతల్లో మాత్రం నిస్తేజం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రతి పక్షపార్టీల పార్టీల ప్రాధాన్యత పెద్దగా లేని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం టీఆర్ అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...