బాల కార్మికులంటూ బాలసదన్ విద్యార్థుల తరలింపు


Sun,January 13, 2019 02:04 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : సెలవుల సందర్భంగా తమ పిల్లలు ఇంటి దగ్గర, పొ లాల దగ్గర ఉన్న పిల్లలను బాల కార్మికులు అంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు బాలసదనం తరలించడాన్ని నిరసిస్తూ శనివారం పిల్లల తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని బాలసదనం ముందు ఆందోళన నిర్వహించారు. సంక్రాంతి సెలవులు ఉం డడంతో తమ పిల్లలు ఇంటికి వచ్చారని వారు ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేక తమ వెంట పొలాలకు వస్తే మాకు తెలియకుం డా మా పిల్లలను బాలసదనకు ఎలా తరలిస్తారని అక్కడ ఉన్న బాలసదనం అధికారితో బాలికల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ బాలికలను బాలసదనం నుంచి తమ వెంట పంపే వరకు తాము ఇంటికి వెళ్లేది లేదని వారు అక్కడే బైఠాయించారు. అయితే బడికి వెళ్లకుండా పను లు చేయిస్తున్న పిల్లలను పోలీస్ జిల్లా సంక్షేమశాఖ, కార్మిక శాఖల ఆధ్వర్యంలో వారిని బాలసదనంకు తరలిస్తున్నారు. రెండు రోజులుగా గద్వాల, అయిజ ప్రాం తంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అయిజ మడంలంకు చెందిన తులసికి తల్లిదండ్రులు లేరు తన నానామ్మ దగ్గర ఉంటుంది. ఆ బాలిక పదో తరగతి వరకు చదువుకుంది.

నానమ్మకు చేదోడు వాదొడుగా ఉంటుంది. ఆ బాలిక బాల కార్మికులుగా పని చేస్తుందని అయిజ నుంచి గద్వాల బాలసదన్ రెం డు రోజుల కిందట తరలించడంతో ముసలమ్మ బాలసదనం ముందు కూర్చొని మ నవరాలి కోసం ఎదురు చూస్తు ఉండి పో యింది. అలాగే కొండాపురానికి చెంది న రేణమ్మ సెలవులకు ఇంటికి వెళ్లింది. సం క్రాంతి పండుగకు ముగ్గులు తెచ్చుకుందామని చేను దగ్గర ఉన్న తన తల్లి దగ్గరకు డబ్బులు తెచ్చుకోవడానికి వెళితే అక్కడ పొలంలో పని చేస్తుందని చెప్పి ఆ బాలిక ను బాలసదనం తరలించారు. బాల సదనంలో రెండు రోజులుగా ఉంటున్న ఆ అ మ్మాయి తనను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించండి అని ఏడుస్తూ ఉన్నా అధికారులు పంపించలేదని వాపోయింది. అధికారులు వాస్తవంగా పొలాలు, మిల్లుల్లో పని చేస్తున్న బాల కార్మికులను పట్టించుకోకుండా సెలవుల కోసం ఇంటికి వచ్చిన త మ పిల్లలను బాలకార్మికులని బాలసదనం తీసుకపోవడం ఏమిటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు చదువుతున్నట్లు ధ్రువపత్రాలు చూయించినా అధికారులు పట్టించుకోవడం లేదని బాలికల తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై డీసీపీవో కుసుమలతను వివరణ కోరగా బాలికల సంక్షేమం కోసమే వారు పొలాల్లో పని చేయకుండా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం, అందుకే బాల కార్మికులను బాలసదనానికి తరలించాం తప్పా వేరే ఉద్దేశం లేదు. బాలికలు చదువుకుంటున్నట్లు బోనఫైడ్ చూయిస్తే ఉన్నత అధికారుల ఆదేశం మేరకు వారిని వారి తల్లిదండ్రుల వెంట పంపిస్తామని చెప్పారు.

490
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...