ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి


Sat,January 12, 2019 02:54 AM

-ఎన్నికల జోనల్ అధికారులతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ, నమస్తేతెలంగాణ : పంచాయతీ ఎన్నికల నియమావళిని ఎంసీసీ, ఇతర బృందాలు పక్కగా అమలు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ ఎన్నికల జోనల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండల స్థాయిలో మోడల్ కోడ్ అమలుకు ఎంసీసీ బృందాలు నియమించినట్లు తెలిపారు. మద్యం, డబ్బు, నియంత్రణకు ఫ్లయింగ్ స్కాడ్ వీఎస్ బృందాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జోనల్ అధికారులు స్టేజ్-2 పీఓ, ఓపీఓ, రూట్ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనతోపాటు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు. కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్న చోట విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. తీసుకోవాలన్నారు. అనంతరం జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లు పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ బృందాలకు కావల్సిన సామగ్రి సరఫరా విషయాలపై ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. నిబంధనలు ఉల్లఘించన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జోనల్ అధికారుల నోడల్ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...