ఆమోదం.. తిరస్కరణ


Fri,January 11, 2019 01:23 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ రెవె న్యూ డివిజన్‌లో పంచాయతీ సర్పంచ్, వార్డుల నామినేషన్ల పరిశీలన గురువారం రాత్రి వరకు కొనసాగింది. ఆరు మండలాల పరిధిలో 1,006 సర్పంచ్ నామినేషన్లు, 4,057వార్డుల నామినేషన్లు అధికారులు ఆమోదించారు. వివిధ కారణాలతో సర్పంచ్‌లకు సంబంధించి 326నామినేషన్లు, వార్డులకు సంబంధించి 495 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా దేవరకొండ మండలంలో 84 సర్పంచ్ నామినేషన్లు, 118 వార్డుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. తిరస్కరణకు గురైన నామినేష్లపై శుక్రవారం ఆర్డీఓకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

తొలి విడుతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 304 సర్పంచ్ స్థానాలకుగాను 2,231 నామినేషన్లు, 2,572 వార్డు స్థానాలకు గాను 7,215 నామినేషన్లు దాఖలయ్యాయి.

వీటిపై అధికారులు గురువారం స్క్రూట్నీ నిర్వహించారు. ఆరు మండలాల పరిధిలోని సర్పంచ్‌లకు సంబంధించి 326 నామినేషన్లు తిరస్కరణకు గురవ్వగా 1,006 నామినేషన్లు ఆమోదింపబడ్డాయి. వార్డులకు సంబంధించి 495 నామినేషన్లను అధికారులు తిరస్కరించగా 4,057 నామినేషన్లు ఆమోదానికి నోచుకున్నాయి. దేవరకొండ మండలంలోనే అత్యధికంగా 84 సర్పంచ్, 118 వార్డులకు సంబంధించిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అతి తక్కువగా మర్రిగూడ మండలంలో సర్పంచ్‌కు సంబంధించి ఒక్క నామినేషన్, వార్డులకు సంబంధించి రెండు నామినేషన్లు మాత్రమే తిరస్కరణకు గురవడం విశేషం. తిరస్కరణకు గురైన నామినేష్లపై శుక్రవారం ఆర్డీఓకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. 13న నామినేషన్లలను ఉప సంహరించుకునే వెసులుబాటు ఉంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...