ఏకగ్రీవం దిశగా నూతన గ్రామ పంచాయతీలు


Fri,January 11, 2019 01:23 AM

దామరచర్ల: ప్రభుత్వం మండలంలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీలు ఎన్నికల్లో ఏకగ్రీవం దిశగా పయనిస్తున్నాయి. నూతనంగా పంచాయతీ లైన బొల్లిగుట్టతండా, తూర్పుతండాల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆయా తండావాసు లు తీర్మానాలు చేశారు. తూర్పుతండాలో 795 జనా భా 595 ఓటర్లు ఉన్నారు. తండాలో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్‌గా గుగులోతి శాంతితో పాటుగా 8 వార్డుల సభ్యులను ఎంపికకు తీర్మానం చేశారు. దీం తోపాటుగా బొల్లిగుట్ట తండాలో 750 జనాభా 493 మంది ఓటర్లు 8వార్డులున్నాయి. తండాలోని లావూరి భాష్యానాయక్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే 15 లక్షల నిధులు గ్రామాభివృద్ధ్దికి కెటాయించి తండా సమస్యలను పరిష్కరించుకుంటామని తండా పెద్దలు తెలిపారు. గత కొన్నేండ్లుగా తండాలన్నీ ఇతర గ్రామ పంచాయతీలకు ఆవాసాలుగా ఉండి అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మారాయని గిరిజన నాయకులు తెలుపుతున్నారు. దీనితోపాటుగా మరికొన్ని తండా లు, గ్రామాల్లో కూడా ఏకగ్రీవం కోసం కసరత్తులు చేస్తున్నారు. నామినేషన్ గడవు ముగిసేలోగా అధికం గా ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఏకగ్రీవ ఎం పికకు సహకరించిన తూర్పుతండా నాయకులను సభ్యులను టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, రైససా అధ్యక్షుడు వీరకోటిరెడ్డి అభినందించారు.

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...